YSRCP ఫోటోతో కండోమ్‌ల అమ్మ‌కాలు..!

YSRCP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి (Jagan Mohan Reddy) శ‌త్రువులు ఎక్క‌డో లేరు.. సొంత పార్టీలోనే ప‌లువురు కార్య‌క‌ర్త‌లు, నేత‌ల రూపంలో ఉన్నార‌ని చెప్ప‌డానికి ఈ ఒక్క ఘ‌ట‌న చాలు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో గెలిచి మ‌రోసారి అధికారాన్ని ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న జ‌గ‌న్ ప‌రువు ఈ ర‌కంగా తీసేస్తున్నారు. జ‌గ‌న్ సిద్ధం (Siddham) పేరుతో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో ఏకంగా సిద్ధం లోగో, జ‌గ‌న్ ఫోటోల‌తో కండోమ్ ప్యాకెట్ల‌ను కూడా అమ్మేస్తున్నారు.

తెలుగు దేశం పార్టీ కూడా..

అయితే.. ఇలా పార్టీ లోగోతో కండోమ్ ప్యాకెట్లను తెలుగు దేశం పార్టీ కూడా అమ్ముతుండ‌డం గ‌మ‌నార్హం. ప‌సుపు రంగు ప్యాకెట్‌లో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) లోగోల‌తో కండోమ్‌లు అమ్మేస్తున్నారు. అస‌లు ఎన్నిక‌ల‌కు కండోమ్ ప్యాకెట్ల‌కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఉంది. అదేంటంటే.. పిల్ల‌ల్ని క‌నడం త‌గ్గిస్తే ప్ర‌భుత్వం నుంచి అందాల్సిన ప‌థ‌కాలు కూడా త‌గ్గుతాయి క‌దా..! ఇందుకోసం పార్టీలు ఈ కొత్త ప్ర‌చార పంథాను ఎంచుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు జిల్లాల‌కు చెందిన స్థానికుల‌తో లోక‌ల్ నేత‌లు చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది.

ALSO READ: AP Elections: పెరుగుతున్న జ‌గ‌న్ గ్రాఫ్.. ఆల‌స్యం చేస్తే మొద‌టికే మోసం

అయితే ముందు ఈ కండోమ్ ప్యాకెట్ల అమ్మ‌కాల‌ను ప్రారంభించింది తెలుగు దేశం పార్టీనే అట‌. ఈ విష‌యంపై జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పందిస్తూ.. కండోమ్‌ల‌తో ఆపేస్తారా.. లేక వ‌యాగ్రాను కూడా పంచుతారా అని పంచ్‌లు వేసారు. దాంతో తెలుగు దేశం పార్టీ కార్య‌క‌ర్త‌లే ఇలా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫోటోతో ఆయన పార్టీ పేరుతో కండోమ్‌లు త‌యారుచేయించి అమ్ముతున్నార‌న్న టాక్ కూడా ఉంది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై తెలుగు దేశం పార్టీ నేత‌లు స్పందిస్తూ.. సిద్ధం అంటే ఎన్నిక‌ల‌కు సిద్ధం అనుకున్నాం కానీ ఈ ప్ర‌క్రియ‌కు సిద్ధం అని అనుకోలేదు అంటూ సెటైర్లు వేసారు.

ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే ఒక పార్టీ మ‌రో పార్టీపై దుమ్మెత్తి పోసుకోవ‌డం.. వ్య‌క్తిగ‌త ధూష‌ణ‌లు చేయ‌డం వంటివి చూస్తుంటాం. ఇలాంటివి సాధార‌ణంగా జాతీయ పార్టీల విష‌యంలో జ‌రుగుతుంది. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బ‌రిలోకి దిగే పార్టీలు ఏ స్థాయికి దిగ‌జారిపోయి అస‌భ్య‌క‌ర‌మైన ప్ర‌చారాలు చేస్తారో తెలిసిందే. అందుకు ఈ కండోమ్‌ల ఘ‌ట‌నే ఉదాహ‌ర‌ణ‌. తెలుగు దేశం పార్టీతో కండోమ్‌లు త‌యారుచేయించింది పార్టీనే అని ఆరోపణలు ఉన్నాయి.

ఎందుకంటే.. ఆ కండోమ్‌లు బ‌య‌టికి రాకుండానే YSRCP వాటి గురించి ప్ర‌స్తావిస్తూ కండోమ్‌ల‌తో ఆపేస్తారా లేక వ‌యాగ్రాలు కూడా ఇస్తారా అని ట్విట‌ర్‌లో కామెంట్ చేసారు. అప్పుడే తెలుగు దేశం పార్టీల కండోమ్‌ల సంగ‌తి బ‌య‌టికి వ‌చ్చింది. మ‌మ్మ‌ల్ని ఇలా అవ‌మానిస్తారా అనుకుంటూ ప‌లువురు తెలుగు దేశం పార్టీ మ‌ద్ద‌తుదారులు కూడా ఇలా పార్టీ లోగోతో కండోమ్ ప్యాకెట్లు త‌యారుచేయించి ఇదెక్క‌డి దిక్కుమాలిన ప్ర‌చారం అంటూ ప్ర‌జ‌ల చేత తిట్టిస్తున్న వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఈ దిక్కుమాలిన రాజ‌కీయ ప్రచారాల్లో జ‌న‌సేన (Janasena) పార్టీ ఇన్‌వాల్వ్ కాక‌పోవ‌డం మంచిదైంది. జ‌న‌సేన ఎప్పుడూ కూడా ఇలాంటి చిల్ల‌ర ప‌నుల‌కు పాల్ప‌డ‌లేదు. ఎందుకంటే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) గ్రౌండ్ లెవెల్ కార్య‌కర్త‌ల‌కు బాగా ట్రైనింగ్ ఇచ్చారు. న‌లుగురిలో న‌వ్వుల పాలు కాకూడ‌ద‌ని ముందుగానే హెచ్చ‌రించారు. తెలుగు దేశం పార్టీతో పొత్తులో ఉన్న‌ప్ప‌టికీ జ‌న‌సేన ఇలాంటి చీప్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డక‌పోవ‌డం మంచి విష‌యమే అని ఆ పార్టీని చూసి సీనియ‌ర్ పార్టీలు అయిన తెలుగు దేశం, YSRCP పార్టీలు చాలా నేర్చుకోవాల‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.