YSRCP: TDPతో పొత్తు.. పవన్ స్థాయిని దిగజార్చుకున్నట్లే
రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (ap elections) జనసేన (janasena), తెలుగు దేశం పార్టీ (tdp) కలిసే పోటీ చేయనున్నాయని జనసేన పవన్ కళ్యాణ్ (pawan kalyan) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకుని తనని తాను దిగజార్చుకోవడమే కాకుండా పార్టీ కేడర్‌ను కూడా దిగజార్చారని YSRCP నేత జక్కంపూడి రాజా (jakkampudi raja) అన్నారు. అసలు పవన్ అధికారంలోకి రావాలని పార్టీ పెట్టారో లేదా చంద్రబాబుకి రాజకీయ లాభం చేకూర్చాలని పెట్టారో అర్థంకావడంలేదని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక పవన్ అసలు స్వరూపం బయటపడిందని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన చంద్రబాబు అరెస్ట్ అయితే పవన్‌కు అంత బాధేంటి అని ప్రశ్నించారు. పవన్ కేవలం పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడన్న విషయం ఏపీ ప్రజలు గ్రహించాలని అన్నారు. (jakkampudi raja)
BJPతో పని అవ్వకే: పెద్ది రెడ్డి
BJPతో పొత్తు పెట్టుకున్నాక తనకు కావాల్సింది దక్కలేదనే మళ్లీ TDP వైపు పవన్ వచ్చాడని ఆరోపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy). మొదటి నుంచి పవన్ తెలుగు దేశానికే మద్దతు ఇస్తున్నాడని అందుకే స్కాంలో ఇరుక్కున్న ఆరోపణలు ఉన్నా కూడా చంద్రబాబునే వెనకేసుకొస్తున్నాడని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది YSRCPనే అని ధీమా వ్యక్తం చేసారు.