AP Elections: ప్లాన్ వ‌ర్క‌వుట్ అవ్వ‌ట్లేదా?

AP Elections: సాధార‌ణంగా ఎన్నిక‌ల స‌మ‌యంలోనే చాలా మంది నేత‌లు ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీకి జంప్ అవుతుంటారు. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో.. అందులో అతి ముఖ్యంగా.. అతి ప్ర‌ధానంగా.. తెలుగు దేశం (Telugu Desam Party), జ‌న‌సేన‌ (Janasena), భార‌తీయ జ‌న‌తా పార్టీల (Bharatiya Janata Party) పొత్తు కుదిరిన నేప‌థ్యంలో YSRCP వేస్తున్న ప్లాన్లు వ‌ర్క‌వుట్ అవ్వ‌డంలేద‌ని తెలుస్తోంది.

ఇంత‌కీ వైసీపీ ప్లాన్ ఏంటి?

నిన్న పొత్తులో భాగంగా ఎవ‌రికి ఎన్ని సీట్లో కూడా లెక్క తేలిపోయింది. ఆల్రెడీ తొలి జాబితాలో భాగంగా తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీలు అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేసేసారు. అయితే ఇదే స‌రైన స‌మ‌యం అనుకుని.. ఎవరైతే సీటు ఆశించ‌గా వారికి రాలేదో.. వారి దగ్గ‌రికి వెళ్లి మా పార్టీలోకి రండి అని రిక్వెస్ట్ చేసార‌ట YSRCP నేత‌లు పేర్ని నాని, కొడాలి నాని. కృష్ణా జిల్లాలోని అవ‌నిగ‌డ్డ‌లో తెలుగు దేశం పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న మండ‌లి దుర్గా ప్ర‌సాద్‌ను త‌మ పార్టీలోకి రావాల‌ని కోరార‌ట‌. ఇందుకు దుర్గా ప్ర‌సాద్ స‌సేమిరా అన్న‌ట్లు తెలుస్తోంది.

ALSO READ: ష‌ర్మిళ‌మ్మా.. ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా?

వంగ వీటి రంగ కుమారుడు వంగ‌వీటి రాధాకృష్ణ‌ను కూడా వైసీపీలోకి లాగాల‌ని చూసారు కానీ వారి వ‌ల్ల కాలేదు. మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గాలు జ‌న‌సేన‌కు ద‌క్కిన నేప‌థ్యంలో స్థానిక తెలుగు దేశం పార్టీ నేత‌లైన సింహాద్రి ర‌మేష్ బాబు, జలీల్ ఖాన్‌ల‌ను త‌మ పార్టీలోకి ఆహ్వానిస్తే వారు కూడా చేరేందుకు ఒప్పుకోలేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. దీనిని బ‌ట్టి చూస్తేనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంద‌ని తెలుగు దేశం, జ‌న‌సేన నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.