CAA: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన వైసీపీ
CAA: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (Citizen Amendment Act) YSRCP వ్యతిరేకించింది. కర్నూల్ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాము ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయబోం అని స్పష్టం చేసారు. ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టానికి చాలా సవరణలు చేయాల్సి ఉందని అప్పుడే దానిని అనుమతిస్తామని స్పష్టం చేసారు. గత ఐదేళ్ల నుంచి తమ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కుల, మత, ప్రాంతాల మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదని కొన్ని వందల సార్లు చెప్తూ వచ్చారని అన్నారు.
చట్టంలో సవరణలు అన్ని వర్గాల వారు అనుమతించేలా ఉండాలని విన్నవించారు. హిందువులు, పార్సీలు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు, ముస్లింలకు సమాన హక్కులు కల్పించే విధంగా ఉండాలని అన్నారు. నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజెన్స్ (NRC), నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) ప్రకారం.. భారతీయ ముస్లిం వ్యక్తి తన పౌరసత్వాన్ని నిరూపించుకోకపోతే అతనికి పౌరసత్వ సవరణ చట్టం వర్తించదని ఉంది. ఇతర మతాలకు చెందినవారికి ఇదే అనుభవం ఎదురైతే అప్పుడు ఆ వ్యక్తికి రక్షణ కల్పించవచ్చు.
ALSO READ: పొత్తు కానుక.. ఎన్టీఆర్‌కు భారత రత్న?
ఈ విషయంలో ఇప్పటికే ముస్లింల వర్గంలో చాలా అసమ్మతి ఉందని.. వారిని NRS, NPR ద్వారా టార్గెట్ చేస్తే అప్పుడు ఏ పౌరసత్వ సవరణ చట్టం వారిని కాపాడలేదని తెలిపారు. కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించి సవరణలు చేయాలని విన్నవించుకుంటున్నట్లు అబ్దుల్ హఫీజ్ ఖాన్ లేఖ రాసారు.