YSRCP: జగన్ పార్టీ ఖాళీ.. TDPలోకి ఎమ్మెల్సీలు..!
YSRCP: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవ్వనుందా? అవుననే టాక్ వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి గెలిచి రెండో సారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేసిన జగన్.. తీరా చూస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం అయ్యారు. శాసన సభలో ప్రతిపక్ష హోదా లేకపోవడంతో.. ఓడిపోయిన రెండో రోజు జగన్ పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు. శాసన మండలిలో జగన్ పార్టీకి మంచి సంఖ్యా బలం ఉంది.
దాంతో శాసన సభలో కాకపోయినా మండలిలో మన గొంతు బలంగా వినిపించాలని జగన్ వారికి దిశానిర్దేశం చేసారు. అయితే ఆ మండలి సమావేశానికి చాలా మటుకు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన దాదాపు ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీని వీడి తెలుగు దేశంలో చేరే యోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. అధికారంలో ఉన్నప్పుడు పేరు మోసిన ఎమ్మెల్యేలనే గంటలు గంటలు వెయిట్ చేయించి అపాయింట్‌మెంట్ ఇవ్వని జగన్.. ఇక ఎమ్మెల్సీలను ఎందుకు పట్టించుకుంటారు? ఇది వారు మనసులో పెట్టుకున్నట్లున్నారు.
అందుకే పార్టీ నుంచి జంప్ అయిపోతే కనీసం రాజకీయ భవిష్యత్తు అయినా ఉంటుందని అంటున్నారట. అదే జరిగితే ఎమ్మెల్యేల బలం లేని జగన్‌కు ఎమ్మెల్సీ బలం కూడా లేక ఇక పార్టీని మూసేసే అవకాశం లేకపోలేదు.