Roja: అప్పుడు నోట్లో ఐస్‌క్రీం పెట్టుకున్నావా పవన్?
AP: జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) చేసిన మహిళల మిస్సింగ్ కేసుల విషయమై YSRCP నేత రోజా (roja) స్పందించారు. అసలు పవన్‌కి మిస్సింగ్‌కి హ్యూమన్ ట్రాఫికింగ్‌కి తేడా తెలుసా అని ప్రశ్నించారు. “మిస్సింగ్ అంటే ప్రేమించి ఇంట్లో తెలీకుండా పారిపోవడమో, లేదా పరీక్షల్లో ఫెయిల్ అయ్యి ఇంట్లోవాళ్లు ఏమైనా అంటారేమో అని భయపడి వెళ్లిపోవడమో చేస్తే దానిని మిస్సింగ్ అంటారు. కానీ హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ అనేది ఉద్దేశపూర్వకంగా ఆడపిల్లల్ని ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దింపడం. మీ దత్త డ్యాడీ ఉన్నాడే చంద్రబాబు నాయుడు… ఆయన సీఎంగా ఉన్నప్పుడు కాల్ మనీ సెక్స్ రాకెట్ మీద మేమంతా ఫైట్ చేసాం. గుర్తుందా? ఆడవాళ్లకి అప్పులిచ్చి ఆ అప్పు కట్టలేకపోతే వారిని ట్రాప్ చేసి వారిని వ్యభిచార కూపంలోకి దింపితే వాళ్లు రాష్ట్రమంతటా ధర్నాలు చేసి కేసులు పెడితే ఈరోజు నువ్వు మాట్లాడలేదు. దాని కోసం ఫైట్ చేసిన నన్ను ఏడాది పాటు సస్పెండ్ చేసారు. అప్పుడు కూడా నువ్వు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? నోట్లో హెరిటేజ్ ఐస్‌క్రీం పెట్టుకున్నావా? “అంటూ మండిపడ్డారు.