Vizag: ఏ ముఖం పెట్టుకుని వచ్చారు?

Vizag: సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల నుంచే ఎమ్మెల్యేకు అవ‌మానం ఎదురైంది. YSRCP ఎమ్మెల్యే గోర్ల కిరణ్ కుమార్‌ను (gorla kiran kumar) వైజాగ్‌లోని తోట‌పాలెం గ్రామ‌స్థులు చుట్టుముట్టేసారు. గ‌డ‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం (gadapa gadapaku mana prabhutvam) ప్రోగ్రామ్‌లో భాగంగా కిర‌ణ్ కుమార్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పర్య‌టిస్తుండ‌గా.. వర్షాలు ప‌డుతున్న‌ప్పుడు, రోడ్లు చీలిపోతున్న‌ప్పుడు రాకుండా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారు అంటూ నిల‌దీసారు.