YSRCP: ఆ సీట్లలో చేతులెత్తేసిన పార్టీ
YSRCP: ఉమ్మడి కడప జిల్లాలో అధికార YSRCP కి ఎదురుగాలి వీస్తోంది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాలు గెలిచిన అధికార పార్టీ ప్రస్తుతం ఎదురీదుతోంది. గత ఎన్నికల్లో సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్యను అడ్డుపెట్టుకుని సక్సెస్ అయ్యారు. అయితే ఉమ్మడి కడప జిల్లాలో పరిస్థితులు మారిపోయాయి. వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) నిందితుడిగా ఉన్నాడు. జగన్ తన అధికారాన్ని ఉపయోగించి అవినాష్‌ను కాపాడుతున్నాడని వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు.
ఇదే విషయాన్ని వైఎస్ షర్మిళ (YS Sharmila) కూడా ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేయొద్దని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో షర్మిళ కడప నుంచి పోటీకి దిగుతుండడంతో సమీకరణాలు మారిపోతున్నాయి. YSRCP కేడర్ మొత్తం ఆమె వైపే మొగ్గు చూపడంతో అవినాష్ రెడ్డి వారికి భారీగా తాయిలాలు ఆశచూపి తనవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బలమైన అభ్యర్ధులను రంగంలోకి దింపిన తెలుగు దేశం పార్టీ గ్రామ గ్రామాల్లో పట్టుబిగుస్తోంది.
జగన్‌కు రాజకీయ కుంభస్థలం లాంటి కడపను కొట్టేందుకు తెలుగు దేశం పార్టీ పక్కా వ్యూహ రచన చేస్తోంది. మరోవైపు అవినాష్ టార్గెట్‌గా కూడా ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ కూడా పూర్తిగా పావులు కదుపుతోంది. దాదాపుగా ఇప్పటివరకు తెలుగు దేశం పార్టీ అయితే ఒక క్రియాశీలక అభ్యర్ధి కోసం వేచి చూస్తోంది. మరో రెండు రోజుల్లో అవినాష్ పైన పూర్తిగా శాసించే ఒక వ్యక్తిని కడప ఎంపీగా కొనసాగించే ఆలోచనలో తెలుగు దేశం ఉంది.
ఈ క్రమంలో కడప అసెంబ్లీ స్థానంలో ఉన్న చాలా మంది కీలక ముస్లిం మైనారిటీ నేతలకు వైఎస్ షర్మిళ వల వేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో అవినాష్ కూడా అప్రమత్తమయ్యారు. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి ఖలీల్ బాషా కుమారుడు సొహైల్‌ని కూడా బుజ్జగించే ప్రయత్నం అవినాష్ చేసారు. సొహైల్ షర్మిళ వెంట నడిచేందుకు పూర్తిగా మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. ఇటు షర్మిళ, తెలుగు దేశం పార్టీలు పూర్తిగా కడపలో జగన్ ఆధిపత్యాన్ని కట్ చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. కడప నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలను తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికే దక్కేలా ఉన్నాయని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ ఏడు సీట్లలోని మూడు కీలక సీట్లు.. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు సీట్లలో అభ్యర్ధుల ప్రక్రియను తెలుగు దేశం చాలా స్ట్రాంగ్‌గా జరిపింది. ఈ మూడు నియోజకవర్గాల్లో తెలుగు దేశం స్పష్టమైన ఆధిక్యతను కనబరిస్తే పులివెందులకు సంబంధించిన జగన్ మెజారిటీ అడ్డుకోలేదని తెలుస్తోంది. దాంతో ఈ మూడు సీట్లలో YSRCP చేతులెత్తేసినట్లు టాక్ నడుస్తోంది. మొత్తానికైతే కడపలో రాజకీయ వేడి కాక పుట్టిస్తోందనే చెప్పాలి.