TDP: YSRCP ఓట‌ర్ల పేర్లు డిలీట్ చేస్తోంది

AP: అధికార YSRCP అపోజిష‌న్ ఓటర్ల పేర్ల‌ను డిలీట్ చేస్తోంద‌ని ఆరోప‌ణ‌లు చేసింది TDP. ఐప్యాక్ (ipac) సాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఓట‌ర్ల పేర్లు డిలీట్ చేస్తోందని TDP ప్ర‌తినిదులు ఆనం వెంక‌ట‌ర‌మ‌ణ రెడ్డి (anam venkata ramana reddy), విజ‌య్ కుమార్లు ఆరోపించారు. గ్రామ‌, వార్డు వాలంటీర్లు సేక‌రించే డేటాను పొలిటిక‌ల్ లాభాల కోసం అధికార పార్టీ దుర్వినియోగం చేస్తోంద‌ని అన్నారు. ఏపీ ప్ర‌జ‌ల నుంచి క‌లెక్ట్ చేసిన డేటాను పొందుప‌ర‌చ‌డానికి ఎలాంటి ప్రొటోకాల్స్, గైడ్‌లైన్స్ లేవ‌ని మండిప‌డ్డారు. సెక్యూరిటీ క్రిడెన్షియ‌ల్స్ భ‌ద్ర‌త కూడా లేద‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు నాయుడు అధికారంలో ఉన్న‌ప్పుడు ఏపీ ప్ర‌జ‌ల ఆధార్ కార్డుల వివ‌రాల‌ను సేక‌రించార‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆరోపించార‌ని గుర్తుచేసారు. అవి ఆల్రెడీ ప‌బ్లిక్ డొమైన్‌లో ఉన్న‌ప్పుడు మ‌ళ్లీ ప్ర‌త్యేకించి క‌లెక్ట్ చేయాల్సిన అవ‌స‌రం చంద్రబాబుకు ఏముంద‌ని ప్రశ్నించారు.