YS Avinash Reddy: అవినాష్‌కు షాక్‌.. ఎంపీ టికెట్‌లో మార్పు!?

YS Avinash Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క‌డ‌ప ఎంపీ టికెట్ విష‌యంలో త‌డబ‌డుతున్న‌ట్లు అనిపిస్తోంది. క‌డ‌ప ఎంపీగా ఈసారి కూడా వైఎస్ అవినాష్ రెడ్డే పోటీ చేయ‌నున్నాడు. వైఎస్ వివేకానంద రెడ్డిని హ‌త్య చేసింది అవినాష్ రెడ్డే అని ఓప‌క్క వైఎస్ ష‌ర్మిళ‌ (YS Sharmila), మ‌రో ప‌క్క వైఎస్ సునీతా రెడ్డిలు (YS Sunitha Reddy) డైరెక్ట్‌గానే మీడియా ముందుకు వ‌చ్చి ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున వైఎస్ ష‌ర్మిళ క‌డప ఎంపీ సీటు నుంచి నిల‌బ‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో వివేకా హ‌త్య కేసుపైనే స‌మావేశాలు, ప్ర‌సంగాలు చేస్తూ ఎలాగైనా అవినాష్‌ను ఓడించాల‌ని ష‌ర్మిళ‌, సునీత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. దాంతో ఈ అంశం కాస్తా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.

ఎంత త‌మ్ముడైనా అవినాష్ రెడ్డిపై క‌డ‌ప‌లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంటే జ‌గ‌న్ మోహన్ రెడ్డి మాత్రం ఏం చేస్తాడు? అందుకే ఈసారి అవినాష్ రెడ్డి విష‌యంలో జ‌గ‌న్ కాస్త వెనుక‌డుగు వేసిన‌ట్లు తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని తీవ్రంగా కృషి చేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న త‌న క‌జిన్ వైఎస్ అవినాష్ రెడ్డికి మ‌ళ్లీ క‌డ‌ప ఎంపీ సీటు ఇచ్చి పెద్ద త‌ప్పు చేసార‌ని ఫీల్ అవుతున్నార‌ట‌. అందుకే అవినాష్‌కు ఏదో ఒక‌టి న‌చ్చ‌జెప్పి.. ఆ స్థానంలో అభిషేక్ రెడ్డి అనే వ్య‌క్తిని దించాల‌ని అనుకుంటున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

అయితే క‌డ‌ప ఎంపీగా అవినాష్ రెడ్డిని కాకుండా మ‌రో వ్య‌క్తిని ప్ర‌కటిస్తే న‌ష్టం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే. వివేకాను హ‌త్య చేయించింది అవినాషే అని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒప్పేసుకున్న‌ట్లు అవుతుంది. సో.. క‌డప ఎంపీ టికెట్ అంశంపై కాస్త గంద‌ర‌గోళం అయితే నెల‌కొంద‌నే చెప్పాలి. క‌డ‌ప టికెట్‌తో పాటు మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్ధుల‌ను జ‌గ‌న్ మార్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల నుంచి వ‌చ్చిన నేత‌ల‌ను ప‌లు స్థానాల్లో నిల‌బెట్టాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.