Viveka case: సునీత మాట మార్చింది.. న్యాయం జరుగుతుంది
Hyderabad: తన అన్నను చంపినవారు బయటతిరుగుతున్నారని అన్నారు దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి (viveka case) సోదరి విమలా రెడ్డి (vimala reddy). వివేకా హత్య కేసుపై ఆమె సంచలన కామెంట్లు చేసారు. ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని (avinash reddy) పరామర్శించేందుకు ఆమె కర్నూలు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మీడియా వర్గాలతో మాట్లాడారు. “వివేకాను చంపిన వారు బయట తిరుగుతున్నారు. తప్పు చేయని వారిని జైల్లో పెట్టారు. అవినాష్‌ను టార్గెట్ చేసి వేధిస్తున్నారు. తన కుటుంబం ఎవరినీ హత్య చేయలేదని మొదట సునీత చెప్పారు. ఆ తర్వాత సునీత మాట మార్చారు. ఇలా మాటమార్చి ఇంట్లోవారిని ఇరికించడం తప్పు అని చెప్పినందుకే సునీత మాతో మాట్లాడటం లేదు. ఆలస్యమైనా న్యాయం జరుగుతుంది. అవినాష్‌కు ధైర్యం చెప్పడానికి వచ్చాను. వైఎస్ కుటుంబంలో పరిణామాలు బాధిస్తున్నాయి. వైఎస్ సునీత వెనుక దుష్టశక్తులు పనిచేస్తున్నాయి” అని తెలిపారు.
మొన్నటివరకు సీన్‌లో లేని విమలా రెడ్డి ఇప్పుడెందుకు సెడన్‌గా వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనిది ఇప్పుడు సునీతదే తప్పు అని ఎలా చెప్తున్నారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అవినాష్‌కి సపోర్ట్ చేయకపోతే ఆమెను కూడా హత్య చేస్తారేమోనన్న భయంతోనే విమలా రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని పలువురి వాదన. ఇక అవినాష్ రెడ్డి విషయం గురించి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సీబీఐ ఏం నిర్ణయం తీసుకుంటుంది అన్న విషయంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇప్పటివరకు ఒక్కసారి కూడా సీబీఐ విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న అవినాష్‌ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరోపక్క ఆయన తల్లి అనారోగ్యంతో ఉంటే విచారణ ఎలా చేస్తారని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.