YS Vimala Reddy: అవినాష్ చిన్నపిల్లాడు.. అక్కాచెల్లెళ్లు ఓవరాక్షన్ చేస్తున్నారు
YS Vimala Reddy: వైఎస్ షర్మిళ, వైఎస్ సునీతా రెడ్డిలపై మండిపడ్డారు వైఎస్ విమలా రెడ్డి. ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డిల సొంత చెల్లెలు. నిన్న షర్మిళ, సునీత రెడ్డిలు పులివెందులలో ప్రచారం చేస్తూ వైఎస్ వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డే చంపాడని ఆరోపణలు చేస్తుండడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు.
“” వైఎస్ షర్మిళ కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతోంది. ఆమెకు నాయకత్వ లక్షణాలు ఎక్కడున్నాయ్? అవినాష్ రెడ్డి వారి మధ్య పెరిగిన వాడే. కుటుంబంలో చిన్న పిల్లాడు. అలాంటి పిల్లాడిని పట్టుకుని వివేకాను హత్య చేసాడు అంటూ అలా ఎలా అనేస్తారు? చంపినవాడు బయట తిరుగుతున్నాడు. వాడు చెప్పిన మాటలు నమ్మి సొంత కుటుంబంలోని వ్యక్తిపై ఎలా ఆరోపణలు చేస్తారు? అసలు షర్మిళ, సునీతలు ఆడపిల్లల్లా ప్రవర్తిస్తున్నారా? ఇప్పటికైనా వారు మారాలని కోరుకుంటున్నాను. నన్ను నా అన్నలు నెత్తిన పెట్టుకుని చూసుకున్నారు. నాకు వివేకం అన్నయ్య అంటే ఎంతో ప్రాణం. వివేకం అన్నయ్యను అవినాష్ చంపలేదు. అనవసరంగా షర్మిళ, సునీతలు రోడ్డుకెక్కి కుటుంబ పరువును బజారుకీడుస్తున్నారు. అవినాష్ చిన్నపిల్లాడు. పాపం వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో నేను చూస్తున్నా. అలాంటి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారే. మీకు అసలు జాలి దయ లేవా? కానీ వీరిద్దరూ చేసేది చాలా తప్పు. నాకు బాధగా ఉంది. మన బంధువులంతా కూడా మీకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారేమో. అదేమీ లేదు. అంతా మీపై కోపంగా ఉన్నారు. రాజశేఖర్ పేరు చెప్పుకుని తిరుగుతూ అవమానిస్తున్నారు. ఆయన శత్రువులంతా నీ చుట్టూ చేరారు. వారితో నువ్వు ఏకమైపోయావు. అన్నను కష్టపెట్టినవారితో నువ్వు తిరుగుతున్నావ్. నీ కళ్లు, చెవులు మూసుకుపోయాయా? కడపలో అభివృద్ధి నీకు కనిపించడం లేదా? అవినాష్‌ను మీరు ఎన్ని మాటలు అన్నా కూడా మిమ్మల్ని ఒక్క మాట అనలేదు. అవినాష్ మీకోసం ప్రార్ధిస్తున్నట్లు తనే నాతో వచ్చి చెప్పాడు. మరి అటువంటి పిల్లాడిపై ఎందుకమ్మా ఇంత ద్వేషం? ఒకసారి నువ్వు సునీత కూర్చుని మాట్లాడుకుని ఈ రచ్చకు ఓ ముగింపు పలకండి “” అని మండిపడ్డారు విమల.