YS Sunitha: అవినాష్ బెయిల్ పిటిషన్‌పై సునీత మెమో
Hyderabad: వైఎస్ వివేకా హత్య (viveka case) కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై (avinash reddy) వివేకా కూతురు వైఎస్ సునీత (ys sunitha) మెమో సబ్మిట్ చేసారు. CBI విచారణ నుంచి తప్పించుకుని తిరుగుతున్న అవినాష్.. తన తల్లి పేరు చెప్పి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారని, అసలు ఆమెకు ఎలాంటి సర్జరీ జరగలేదని మెమోలో పేర్కొన్నారు. తప్పుడు వాదనలు చేసి కోర్టు సమయం వృథా చేసినందుకు అవినాష్ (avinash reddy) లాయర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మెమోలో పేర్కొన్నారు.
అవినాష్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు కొన్ని కండీషన్లు విధించింది. సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని, ప్రతి శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలని తెలిపింది. ఒకవేళ అవినాష్‌ను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే రూ.5 లక్షల పూచీకత్తుపై బెయిల్‌పై విడుదల చేయాలని సీబీఐను కోర్టు ఆదేశించింది. ఈ కండీషన్లలో ఏ ఒక్కటి ఉల్లఘించినట్లు తెలిసినా అరెస్ట్‌కు సీబీఐ కోర్టు పర్మిషన్ తీసుకోవచ్చని తెలిపింది.