విలేకరి ప్రశ్న.. నవ్వుల పాలైన సునీతా రెడ్డి..!
YS Sunitha Reddy: తన తండ్రి కోసం న్యాయ పోరాటం చేస్తున్న వైఎస్ సునీతా రెడ్డి.. ఈరోజు మీడియా వర్గాలను పిలిపించి తన తండ్రి కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను ప్రజెంటేషన్ వేసి చూపించారు. ఆ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయితే ఇలాంటి సీరియస్ సంభాషణలు జరిగే సమయంలో చంచల స్వభావంతో ప్రవర్తించకూడదు. ఓవరాక్షన్ చేయకూడదు. కానీ ఇప్పుడు సునీతారెడ్డి అదే చేసారు.
ఓ విలేకరి సునీతను ప్రశ్నిస్తూ.. మేడం మీ వెనుక రాజకీయ పార్టీల మద్దతు ఉంది కదా అని ప్రశ్నించారు. ఇందుకు అవునో కాదో సింపుల్‌గా సమాధానం చెప్తే సరిపోయేది. కానీ సునీత కాస్త ఓవర్ చేసి మీ వెనుక అనగానే వెనక్కి తిరిగి చూస్తూ నా వెనుక ఎవరున్నారు? నేను ఒక్కదాన్నే వచ్చాను కదా. నాతో పాటు ఇంకెవరైనా రావడం మీరు చూసారా అని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. దాంతో అక్కడే ఉన్న ఓ విలేకరి సహనం కోల్పోయినట్లుగా.. మీ వెనుక అంటే నిజంగా మీ వెనుక అని కాదు మేడమ్. మీరు మాట్లాడే మాటలు ప్రతిపక్షాలు మాట్లాడే మాటల్లా ఉన్నాయి అన్నారు. దాంతో సునీత తన పరువును తానే తీసుకున్నట్లు అయ్యింది.