గెలుపు అంచున TDP .. ఆనందంలో వైఎస్ సునీతా రెడ్డి
తెలుగు దేశం పార్టీ (జనసేన, భారతీయ జనతా పార్టీ) గెలుపు అంచున ఉంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి ఆధిక్యంలో దూసుకెళ్తున్న తెలుగు దేశం పార్టీ మధ్యాహ్నానికి అధికారికంగా విజయ కేతనం ఎగరవేస్తుంది. ఈ నేపథ్యంలో దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రిని పొట్టనబెట్టుకున్న వైఎస్ అవినాష్ రెడ్డికి.. జగన్ మోహన్ రెడ్డి పార్టీలకు ఓట్లు వేయకండి ఆమె కన్నీరుపెట్టి మరీ విన్నివించుకున్నారు. చివరికి ఆమె కోరుకున్నట్లుగానే వైఎస్సార్ కాంగ్రెస్ మూట ముల్లె సర్దుకునేందుకు రెడీగా ఉంది.
ఈ నేపథ్యంలో వైఎస్ సునీతా రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ అధికారంలోకి ఆల్మోస్ట్ వచ్చేసిన నేపథ్యంలో ఇకనైనా తన తండ్రి హత్య వెనకున్న వారికి శిక్ష పడి తన తండ్రి ఆత్మ శాంతిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే.. తన సోదరి వైఎస్ షర్మిళ కోసం కడపలో ఒక రేంజ్‌లో ప్రచారం చేసినప్పటికీ షర్మిళ దాదాపు లక్ష 20 వేల ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.