YS Sharmila: పార్టీ విలీనానికి ఒప్పుకున్నట్లేనా?
Hyderabad: కాంగ్రెస్ (congress) పార్టీలో చేరికకు వైఎస్ షర్మిలకు (ys sharmila) లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. కేవీపీ రామచంద్రరావు మధ్యవర్తిత్వంతో ysrt పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి షర్మిళ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాదు పాలేరు నుండి పోటీ చేయడానికి కాంగ్రెస్ హై కమాండ్ కూడా ఒప్పుకుందట. గతంలో పలుమార్లు వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేయాలని ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ అడిగినప్పటికీ షర్మిళ ఒప్పుకోలేదు. కావాలంటే పొత్తు పెట్టుకుంటే సరిపోతుంది కదా అని తరచూ వాదించేవారు. ఆ తర్వాత షర్మిళ కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను (dk shivakumar) కలిసారు. ఆయన కూడా విలీనం చేయడానికే ఒప్పుకోమని చెప్పడంతో ఇక షర్మిళ అందుకే ఓకే చెప్పినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఏదేమైనప్పటికీ ఈ నెల 25న ఏ విషయం అన్నది షర్మిళ ప్రకటించనున్నారు.