EXCLUSIVE: చంద్ర‌బాబు ఇంటికి ష‌ర్మిళ‌

EXCLUSIVE: తెలుగు దేశం పార్టీ (TDP) అధినేత చంద్ర‌బాబు నాయుడును (chandrababu naidu) వైఎస్ ష‌ర్మిళ (ys sharmila) క‌ల‌వ‌నున్నారు. త‌న కుమారుడు రాజా రెడ్డి వివాహ వేడుక‌కు చంద్ర‌బాబు కుటుంబాన్ని ఆహ్వానించేందుకు ష‌ర్మిళ వెళ్ల‌నున్నారు. ఈరోజు ఉద‌యం 11 గంట‌ల‌కు ష‌ర్మిళ చంద్ర‌బాబు ఇంటికి వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ష‌ర్మిళ నారా లోకేష్‌కు క్రిస్మ‌స్ కానుక‌ను పంపి తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టించారు. ముఖ్యంగా ష‌ర్మిళ చేసిన ప‌నికి ఏపీ షాకైపోయింది. ఇక పెళ్లికి కూడా పిలుస్తున్నారంటే జ‌గ‌న్ ష‌ర్మిళ‌ను పూర్తిగా దూరం పెట్టేసే అవ‌కాశం లేక‌పోలేదు.