YS Sharmila: క‌డ‌ప నుంచి లోక్‌ స‌భ ఎంపీగా..?

YS Sharmila: AICC అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ‌.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో (Lok Sabha Elections) క‌డప ఎంపీగా బరిలోకి దిగ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. కాంగ్రెస్ హైక‌మాండ్ క‌డ‌ప నుంచి ఎంపీగా పోటీ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింద‌ట‌. ఇందుకు ష‌ర్మిళ కూడా ఒప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నెల 25న కాంగ్రెస్ జాబితా రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది. పార్టీ అధ్య‌క్షురాలిగా తాను బ‌రిలో నిలిస్తేనే అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ కాంగ్రెస్‌కు మరింత బ‌లం చేకూరుతుంద‌ని ష‌ర్మిళ అభిప్రాయం.

YSRCP నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి (YS Sharmila) క‌డ‌ప ఎంపీగా పోటీ చేయ‌నున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో ప్ర‌ధాన అనుమానితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) మ‌ళ్లీ టికెట్ ఇవ్వ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఎవ‌రు ఎన్ని చెప్పినా త‌న బాబాయి కొడుకు ఎలాంటి త‌ప్పు చేయ‌లేదు అన్న‌ట్లుగా మ‌ళ్లీ క‌డ‌ప ఎంపీ టికెట్ ఇచ్చారు. సో.. ఈసారి క‌డ‌ప ఎంపీ స్థానం నుంచి అవినాష్‌ను ఢీకొట్టాల‌ని షర్మిళ కూడా నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. అదే నిజ‌మైతే ఒకే కుటుంబానికి చెందిన వారు ప్ర‌తిప‌క్షాల‌లో నిల‌బ‌డి ఒక‌రిపై ఒకరు పోటీ చేసుకోవ‌డం ఇదే తొలిసారి అవుతుంది.

ALSO READ: BRS BJP: BJPతో క‌ల‌వ‌నున్న KCR..?