AP Elections: ఏపీ ఎన్నికలు.. బరిలోకి షర్మిళ
AP Elections: తెలంగాణ ఎన్నికల ముచ్చట అయిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో సీట్లు కదులుతున్నాయ్. టికెట్లు ఇస్తారో లేదో అని మంత్రులు, ఎమ్మెల్యేలకు చెమటలు పడుతున్నాయ్. మరోపక్క ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిలను మార్చడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది. తెలంగాణలో KCRను గద్దె దించేందుకే వైఎస్ షర్మిళ (ys sharmila) పోటీ నుంచి తప్పుకుంది. మొత్తానికి ఆమె కోరుకున్నట్లే జరిగింది.
ఇప్పుడు కాంగ్రెస్ ఇక ఆంధ్రప్రదేశ్‌పై గురిపెట్టింది. అక్కడ కూడా క్లీన్ స్వీప్ చేయాలన్న ప్లాన్‌లో ఉంది. ఇందుకోసం షర్మిళను సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. షర్మిళను ఏపీ నుంచి పోటీ చేయించే యోచనలో ఉంది కాంగ్రెస్. మరి ఇందుకు షర్మిళ ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే తెలంగాణ బిడ్డను ఇక్కడే పుట్టాను పెరిగాను తెలంగాణ కోసమే నా పోరాటం అంటూ గొంతు చించుకుని మరీ ప్రచారం చేసిన షర్మిళ తన అన్న జగన్‌కు వ్యతిరేకంగా పోటీ చేస్తారంటే నమ్మశక్యంగా లేదు.
ఒకవేళ అదే జరిగితే జగన్ మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు షర్మిళను తన వైపుకు తిప్పుకునేందుకు కూడా క్షణం ఆలోచించరు. ముందు అధికారం వస్తే ఆ తర్వాత పదవుల గురించి మాట్లాడుకుందాం అని ఏదో ఒకటి చెప్పి చెల్లెల్లిని తన గుప్పెట్లో పెట్టుకోవాలనే చూస్తారు. మరి షర్మిళ ఎవరి వైపు ఉంటారో ఆమె వెల్లడించాలి.