ముందు ష‌ర్మిళ‌.. త‌ర్వాత జ‌గ‌న్..!

AP: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ (ys sharmila) నేడు పులివెందుల‌కు వెళ్లారు. త‌న తండ్రి దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న స‌మాధికి నివాళులు అర్పించేందుకు పులివెందుల వెళ్లారు. త‌న‌తో పాటు కుమారుడు రాజా రెడ్డిని కూడా తీసుకెళ్లారు. ఈరోజు త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇడుపులపాయలో YSR ఘాట్ వద్ద షర్మిల, సీఎం జగన్ (ap cm jagan) ఇద్దరూ మొదటిసారి వేర్వేరు సమయాల్లో నివాళులు అర్పించనున్నారు. ఈరోజు ఉదయం షర్మిల (sharmila) తన తల్లి విజయమ్మతో కలిసి నివాళులు అర్పించనుండగా, సీఎం జగన్ మధ్యాహ్నం 1:55 నిమిషాలకు ఇడుపులపాయ చేరుకొని నివాళులు అర్పించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ప్రతి సంవత్సరం జగన్, షర్మిల కలిసే ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు. ఈసారి మాత్రం ఒకరికొకరు ఎదురు పడకుండా జాగ్రత్త పడి ఎవరికివారే వేర్వేరు సమయాల్లో పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న ఆస్తుల‌ను వార‌సుల పేరు రాసేసారు ష‌ర్మిళ‌. తన పేరిట ఉన్న 9.53 ఎకరాల భూమిని కుమారుడు రాజారెడ్డి పేరు మీద, ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుండి కొనుగోలు చేసిన 2.12 ఎకరాల భూమిని కూతురు అంజలి రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన‌ట్లు స‌మాచారం.