Viveka Case: షర్మిల వాంగ్మూలం.. ఆధారాల్లేవ్..!

Hyderabad: వైఎస్ వివేకానంద రెడ్డి (viveka case) హత్య కేసులో 259వ సాక్షిగా CBI ఎదుట హాజరైన YSRTP అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిళ (ys sharmila) వాంగ్మూలం ఇచ్చారు.

“నా వద్ద ఆధారాల్లేవు. కానీ రాజకీయ కారణాలతోనే వివేకా హత్య జరిగింది. హత్యకు కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు కారణాలు కాదు. పెద్ద కారణం ఉంది. అవినాష్ (avinash reddy) కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడటమే కారణం కావొచ్చు. వారికి అడ్డు వస్తున్నారని మనసులో పెట్టుకోవచ్చు. హత్యకు కొన్ని నెలల ముందు బెంగళూరులోని మా ఇంటికి వివేకా వచ్చారు. కడప ఎంపీగా పోటీ చేయాలని ఆయన నన్ను అడిగారు. ఎంపీగా అవినాష్ పోటీ చేయొద్దని కోరుకుంటున్నట్లు చెప్పారు. అతడికి టికెట్ ఇవ్వకుండా ఎలాగైనా జగన్‌ను (ap cm jagan) ఒప్పిద్దామన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా తాను వెళ్లనని వివేకా ఆలోచించారు. కచ్చితంగా ఒప్పించగలననే ధీమాతో ఆయన మాట్లాడారు. జగన్ నాకు మద్దతివ్వరని తెలుసు కాబట్టి ఎంపీగా పోటీకి మొదట ఒప్పుకోలేదు. బాబాయ్ పదేపదే ఒత్తిడి చేయడంతో సరే అన్నాను” అని షర్మిల తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.