YS Sharmila: బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్‌లోకి ష‌ర్మిళ‌

YS Sharmila: YSRTP అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ త్వ‌ర‌లో కాంగ్రెస్‌లో చేర‌నున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. మ‌రుస‌టి రోజు ష‌ర్మిళ‌ కాంగ్రెస్‌లో చేర‌తారు. YSRTPని విలీనం చేయ‌డం కంటే అందులో చేరిపోవ‌డం బెట‌ర్ అని అనుకున్నారు. సో ఇక YSRTP అనేది లేన‌ట్లే. అన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో (jagan mohan reddy) ఇబ్బందులు రావ‌డంతో ష‌ర్మిళ తెలంగాణ‌లో పార్టీ పెట్టారు.

ఆమె ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు కానీ KCR అధికారంలో ఉండ‌కూడ‌దు అని పోటీ చేయ‌కుండా కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చింది. చివ‌రికి ఆమె అనుకున్నట్లే జ‌రిగింది. KCR గ‌ద్దె దిగిపోయారు. ఇక ష‌ర్మిళ‌కు తెలంగాణ‌లో పెద్ద‌గా ప‌నిలేదు. ఇప్పుడు ఏపీలో ఎన్నిక‌లు రానున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ చూపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైపు ప‌డింది. ఏపీలో స్ట్రాంగ్ క్యాండిడేట్‌ని పెట్టాల‌ని చూస్తున్న కాంగ్రెస్ సీఎం చెల్లెలే స‌రైన గురి అనిపించింది. ఆమెను ఏపీకి కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ప్ర‌క‌టించి అక్క‌డ కూడా కాంగ్రెస్ పావులు క‌ద‌పాల‌ని చూస్తోంది.