YS Sharmila: రేపు BRS ఓడిపోతే.. KCR నేతలను కొనకూడదు
YS Sharmila: తనతో పాటు విముక్తి తెలంగాణ కోసం పోరాడిన.. తనతో కలిసి KCRను తిట్టినవారు ఇప్పుడు ఆయనతోనే ఎలా చేతులు కలిపారు అని ప్రశ్నించారు వైఎస్ షర్మిళ. ఎందుకు ఆయనకు అమ్ముడుపోయారని ప్రజలు తన పార్టీ నేతలను తిడుతుంటే భరించలేకపోతున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల బాగు కోసమే తాను పోటీ నుంచి తప్పుకున్నానని వెయ్యి సార్లు చెప్పినా తన మాట వినకుండా తనపై విమర్శలు చేసినందుకు ఎంతో బాధపడుతున్నట్లు తెలిపారు.
KCR ఇంటికి వెళ్లే టైం వచ్చింది కాబట్టి సూట్‌కేసు పంపుతున్నానని.. ఆయన ఈ సూట్‌కేసులో ప్యాకప్ చేసుకుని వెళ్లాలని ఆశిస్తున్నట్లు సెటైర్ వేసారు.రేపు ఎన్నికల ఫలితాలు వెలువడతాయి కాబట్టి.. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నట్లు కాంగ్రెస్ గెలిచినా BRS పార్టీ ఓడిపోయినా అది ప్రజా తీర్పు అని స్వీకరించాలి కానీ KCR ఇతర పార్టీ నేతలను కొనకూడదు అని డిమాండ్ చేసారు. 2014, 2018 ఎన్నికల సమయంలో కూడా KCR ఇతర పార్టీలకు చెందిన దాదాపు 45 మంది నేతలను కొనుగోలు చేసారని షర్మిళ ఆరోపించారు. వారిలో 40 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, 1 ఎంపీ ఉన్నట్లు తెలిపారు.