Sharmila: అప్పుల్లో తెలంగాణ 5వ స్థానం, ఆత్మహత్యల్లో 4వ స్థానం

తెలంగాణ రాష్ట్రం (telangana) అప్పులో 5వ స్థానంలో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల్లో 4వ స్థానంలో ఉంద‌ని అన్నారు YSR తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ‌ (sharmila).

“” అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని దొంగమాటలు చెప్పడానికి దొరకు సిగ్గుండాలి. మీది రైతు ప్రభుత్వమే అయితే.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగనట్లు? భరోసా పాలనైతే రోజుకు నలుగురు బలవన్మరణాలకు ఎందుకు పాల్పడుతున్నట్లు? కోటీశ్వరులయితే అప్పుల్లో 5వ స్థానం, ఆత్మహత్యల్లో 4వ స్థానం, ఆదాయంలో 25 స్థానంలో మన రైతులు ఎందుకున్నట్లు? మీ దిక్కుమాలిన 9 ఏండ్ల పాలనలో 8 వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్నారు. మీ చేతకాని పాలనతో రైతులను నిండా ముంచారు. సగటున ఒక్కో రైతు రూ.75 వేల అప్పు చేసేలా చేసిన మీ పాలన రైతుకు భరోసా కాదు.. బర్బాద్ చేసిన పాలన. రైతన్నకు బతుకే లేకుండా చేసిన బందిపోట్ల పాలన. ఎన్నికలకు రెండు నెలల ముందు లక్ష మాఫీ చేశామని గప్పాలు కొట్టే దొరగారు.. మీరిచ్చే లక్షతో మాఫైంది రుణం కాదు దాని తాలుకా వడ్డీనే. అసలు అప్పు ఇంకా రైతు నెత్తిన గుదిబండే. నేలపాలైన పంటకు పరిహారమని మాయమాటలు చెప్పారే తప్ప ఏనాడూ రూపాయి ఇచ్చింది లేదు. రెండు దఫాలుగా అధికారంలో ఉండి 14 వేల కోట్ల పంట నష్టపరిహారం ఎగ్గొట్టారు. ఎన్నికల ఏడాదైనా ఇస్తారనుకుంటే ఇవ్వాల్సిన 2 వేల కోట్ల పరిహారానికి పంగనామాలు పెట్టారు. ముష్టి 5 వేలు రైతుకు ఇచ్చి 35 వేల లబ్ధి పథకాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. అందుకే కేసీఆర్ ముమ్మాటికి రైతు ద్రోహి. రైతుల పాలిట రక్షకుడు కాదు రాక్షసుడు. కేసీఆర్ రైతు భక్షక పాలన అంతమయ్యే సమయం దగ్గరపడింది “” అంటూ తీవ్రంగా ఆరోప‌ణ‌లు చేసారు. (ys sharmila)