YS Sharmila: అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ మారిపోయారని అన్నారు APCC చీఫ్ వైఎస్ షర్మిళ. జనసేన పార్టీ ఒక సెక్యులర్ పార్టీ అనుకున్నానని.. కానీ పవన్ ఉప ముఖ్యమంత్రి కాగానే తన పార్టీని రైటిస్ట్ పార్టీగా మార్చేసారని వ్యాఖ్యానించారు.
“” ఏమైంది పవన్ కళ్యాణ్‌గారూ మీకు? ఆ వేషధారణలో అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనడం ఏంటి? మీరు ఇలా సనాతన ధర్మం అంటూ ఒకే మతం గురించి మాట్లాడుతుంటే రాష్ట్రంలోని ఇతర మతస్థులకు అభద్రతా భావం కలగదా? అసలు ఎందుకు మీరు ఇలా మారిపోయారు? జనసేన పార్టీ అంటే ఇతర పార్టీల్లా కాదు సెక్యులర్ పార్టీ అనుకున్నా. కానీ మీరు కూడా రైటిస్ట్ పార్టీ వ్యక్తిలాగే ప్రవర్తిస్తున్నారు. మీరు మోదీ డైరెక్షన్‌లో నడుస్తున్నారా? ఇలాంటి సనాతన ధర్మం పేరుతో కార్యక్రమాలు చేపట్టేది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే. మీరేమన్నా ఆర్ఎస్ఎస్ సీక్రెట్ ఏజెంటా? అలా మాల వేసుకుని మరీ అధికారిక కార్యకలాపాలు చేయడమెంందుకు? అంత అవసరం ఏమొచ్చింది? “” అని ప్రశ్నించారు.