YS Sharmila: చిన్నదొర చెప్పిన పెద్ద జోక్ ఇదే!
Hyderabad: YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ (ys sharmila) ఛాన్స్ దొరికినప్పుడల్లా bRS పార్టీని విమర్శిస్తున్నారు. ఇప్పుడు మరోసారి తెలంణాణ ఐటీ శాఖ మంత్రి KTRపై నిందలు వేస్తూ ట్వీట్లు చేసారు. KTR మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, పోలీసులను అడ్డుపెట్టుకోవడం లేదని ఓటర్లకు డబ్బు, మద్యం పంచట్లేదని చిన్నదొర చెప్పిన ఈ దశాబ్దపు పెద్ద జోక్ ఇదేనంటూ షర్మిళ కామెంట్ చేసారు.
“పోలీసులు అడ్డు లేనిదే అడుగు కూడా బయట పెట్టలేనోడు.. అడ్డం పొడుగు మాటలు చెప్తే నమ్మే పిచ్చోళ్లు కాదు తెలంగాణ ప్రజలు. అన్నం పెట్టే రైతుకు బేడీలు వేసి, చంటి బిడ్డల తల్లులు అని చూడకుండా జైళ్లకు పంపిన హింసాత్మక పాలన మీది. పోలీసు వ్యవస్థను మీ బానిస వ్యవస్థగా మార్చారు. అయ్యా చిన్న దొర KTR.. మీరు నిజంగా సుద్ధపూసలే అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు. నేరెళ్ళలో దళితులపై పోలీసులను అడ్డుపెట్టుకొని థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదా? ఇప్పటికీ నువ్వు సిరిసిల్ల పోతే 7 ఏళ్లుగా ఆ నేరెళ్ల మొత్తం హౌజ్ అరెస్ట్ చేయడం లేదా..? మిడ్ మానేర్ ముంపు బాధితులు న్యాయ మడిగితే అరెస్టులు చేయలేదా?
నిన్న గాక మొన్న వరంగల్ పోతే విద్యార్థి నాయకులను, ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేయించలేదా? నీ సభల కోసం జనాలు రాకపోతే పథకాలు కట్ అని బెల్లంపల్లిలో బెదిరించలేదా? డబ్బు, మద్యం పంచనని దొంగ మాటలు చెప్పే దొర గారు.. మొన్నే జరిగిన సిరిసిల్ల కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో డబ్బులు పంచలేదా? మునుగోడు,నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటుకు 10వేలు పంచింది మీ సారథ్యంలోనే కదా! వేల కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొన్నది నీ పార్టీ. మొత్తం లోక్ సభ ఎన్నికలకు పెట్టేంత సొత్తు వెనకేశారు” అని విమర్శించారు షర్మిళ.