YS Sharmila: తెలంగాణ బిడ్డను.. తెలంగాణ ప్రజల కోసమే జీవిస్తా
YS Sharmila: తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు చాలా మంది షాకయ్యారని అన్నారు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ. ఇందుకు కారణం తన అన్న జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) ఏపీ సీఎంగా ఉంటే.. ఆమె కూడా అక్కడి నుంచే పోటీకి దిగుతారు అనుకున్నారు కానీ తెలంగాణ గడ్డపై పార్టీ పెడతారని ఎవ్వరూ ఊహించలేదు.
తాను తెలంగాణలో పుట్టకపోయినా ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకుని ఇక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకుని ఇక్కడే పిల్లల్ని కన్నానని అంటున్నారు. ఎన్నికల్లో (telangana elections) పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించగానే తన వెంట ఉన్నవారు కూడా కనీసం సపోర్ట్ చేయలేదని ఓ సందర్భంలో వెల్లడించారు షర్మిళ. తాను కూడా పోటీ చేస్తే ఎక్కడ ఓట్లు చీలి మళ్లీ BRS ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందేమోనన్న భయంతోనే తాను పోటీ నుంచి తప్పుకున్నాను కానీ భయంతో కాదని పేర్కొన్నారు. అలాగని కాంగ్రెస్ పార్టీ మంచిదని చెప్పడంలేదని.. కానీ BRSతో పోలిస్తే కాంగ్రెస్ కాస్త బెటరేనని తెలిపారు.
తన టైం ఇంకా రాలేదని వచ్చినప్పుడు తప్పకుండా పోటీ చేస్తానని పేర్కొన్నారు. KCR సీఎం అయినప్పుడు ఐదేళ్ల పాటు ఏమీ చేయలేదని.. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో తనకు ఐదేళ్లు సరిపోలేదు ఇంకో ఐదేళ్లు ఇస్తే చేస్తానని చెప్పినప్పుడు తాను కూడా నమ్మానని తెలిపారు. కానీ రెండోసారి కూడా KCR మోసం చేసారని పేర్కొన్నారు. అందుకే ఈసారి KCRను నమ్మకూడదు అనుకుంటున్నానని చెప్పారు.