YS Sharmila: బాబాయ్‌ని చంపినప్పుడు ధర్నా చేయలేదమన్నా..? షర్మిళ సెటైర్లు
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని దీనిపై తన గళాన్ని వినిపించేందుకు ధర్నా చేయాలనుకుంటున్నానని ప్రకటించారు. దీనిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ స్పందించారు. అసలు జగన్ ఎందుకు ధర్నా చేయాలనుకుంటున్నారో తనకైతే అర్థంకావడంలేదని అన్నారు.
వినుకొండలో జరిగిన హత్య రాజకీయ హత్య కాదని తాము ఇంటర్నల్‌గా చేసిన విచారణలో తేలిందని.. మరి దానిని రాజకీయ హత్యగా చూపిస్తూ ఎలా ధర్నా చేస్తారని ప్రశ్నించారు. “” అసలు జగన్ అన్న ఎందుకు ధర్నా చేయాలనుకుంటున్నారు? గత ఐదేళ్ల ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఎప్పుడైనా ధర్నా చేసాడా? విశాఖ స్టీల్ ప్రైవెటీకరణ చేయొద్దు అని ధర్నా చేసారా? పోనీ బాబాయ్‌ని దారుణంగా హత్య చేసిన వారికి శిక్ష పడాలని కోరుతూ ఎప్పుడైనా ధర్నా చేసారా? అప్పుడు చేయని ధర్నా ఇప్పుడు ఎందుకు? అన్నగారికి ఉన్నదే 11 ఎమ్మెల్యేలు. ఆ 11 ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్లి ఎందుకు నిలదీయడంలేదు? ఆ ధైర్యం లేదు కానీ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తాడంట “” అంటూ సెటైర్లు వేసారు.