YS Sharmila: కాంగ్రెస్ ద‌ద్ద‌మ్మ అయితే… BRS పెద్ద దద్ద‌మ్మ‌

Hyderabad: కాంగ్రెస్ నేత‌లు ద‌ద్ద‌మ్మ‌లు అయితే.. BRS పార్టీ నేత‌లు పెద్ద ద‌ద్ద‌మ్మ‌లు కారా అంటూ మ‌రోసారి ఆ పార్టీపై ధ్వ‌జ‌మెత్తారు YSR తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వై.ఎస్ ష‌ర్మిళ‌.

“తెలివిలేనోళ్లు కాంగ్రెసోళ్ళయితే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొన్న మీది అతి తెలివి కాదా చిన్న దొర..! కాంగ్రెస్ నేతలు చేతకాని దద్దమ్మలు అయితే 2014 లో 6గురిని కొన్న మీరు పెద్ద దద్దమ్మలు కారా..? చేతకాని సన్నాసులే అయితే 2018 లో 12మందిని కొన్నందుకు మీరు పెద్ద సన్నాసులు కారా..? ప్రతిపక్ష లీడర్లు ఎన్నికల సమయంలోనే కనిపించే సంక్రాంతి గంగిరెద్దులైతే… ఎన్నికలకు 6 నెలల ముందు నిద్ర లేచిన కుంభకర్ణుడు కేసీఆర్. ఎందుకు మళ్ళీ కేసీఆర్ ను ఆశీర్వదించాలో ఒక్క కారణం చెప్పు చిన్న దొర..? రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని.. రూ.5లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసినందుకు మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలా..?”

“ప్రాజెక్టుల పేరు చెప్పి మీ కుటుంబం లక్ష కోట్లు కాజేసినందుకు ఆశీర్వదించాలా..? ఇంటికో ఉద్యోగం అని చెప్పి, 9 ఏళ్లలో 65 వేల ఉద్యోగాలే ఇచ్చినందుకు మళ్ళీ అధికారం ఇవ్వాలా ? మీ పాలనలో నిరుద్యోగం 100 రెట్లు పెరిగి నిరుద్యోగ జాబితాలో,ఆత్మహత్యల్లో నెం.1 ఉన్నందుకు మిమ్మల్ని ఎన్నుకోవాలా.? రెండు దఫాలుగా లక్ష ఇండ్లు కట్టలేని మీరు మళ్ళీ పేదలను ఉద్ధరిస్తామని చెప్తే నమ్మాలా..? ధరణి పేరు చెప్పి భూములు లాక్కున్నందుకు.. మీ అనుచర వర్గం కోసం 30 వేల ఎకరాలు సర్కారు భూమి అమ్మినందుకు మీరు గొప్పోల్లు అని ఆశీర్వాదం ఇవ్వాలా..? పోలీసులను పనోళ్లు వాడుకుంటూ రౌడీల పాలన చేస్తున్నందుకు,తాలిబన్ల పాలన చూపిస్తున్నందుకు ఓట్లు వేయమంటారా..?”

“వడ్లు కొనడం లేదని కేంద్రం మీద నెపం నెట్టి, రైతుల చావులకు కారణం అయినందుకు ఎలా దీవించమంటారు? వరి వేస్తే ఉరేనని.. కౌలు రైతు రైతే కాదన్న దుర్మార్గుడు కేసీఆర్. 9 వేల మంది రైతులను పొట్టనపెట్టుకున్న హంతకుడు కేసీఆర్. పోడు పట్టాల నుంచి మొదలు దళితబంధు వరకు మోసాలకు తెగబడ్డ కేసీఆర్ ఒక గజ దొంగ. చేతకాని దద్దమ్మలంతా బంధిపోట్ల రాష్ట్ర సమితిలోనే ఉన్నారన్నది జగమెరిగిన సత్యం. మీలాంటి చేతకాని దద్దమ్మలను, సన్నాసులను ఆశీర్వదించడం కాదు. తన్ని తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి” అంటూ మండిప‌డ్డారు ష‌ర్మిళ‌