YS Sharmila: పాలేరు పోటీ నుంచి త‌ప్పుకున్న ష‌ర్మిళ‌

Telangana Elections: వైఎస్ ష‌ర్మిళ  (ys sharmila) రానున్న తెలంగాణ ఎన్నిక‌ల్లో పాలేరు (paleru) బ‌రి నుంచి త‌ప్పుకున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. మ‌రోప‌క్క ఎన్నిక‌ల క‌మిష‌న్ YSRTPకి బైనాక్యుల‌ర్స్‌ని ఎన్నిక‌ల గుర్తుగా ప్ర‌క‌టించింది. కానీ ఈ గుర్తు త‌న‌కు న‌చ్చ‌లేద‌ని వేరే గుర్తు కేటాయించాల‌ని షర్మిళ కోరారు. త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డానికి ఒప్పుకున్న ష‌ర్మిళ‌.. ఆ త‌ర్వాత ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న పార్టీ పోటీ చేస్తుంద‌ని ష‌ర్మిళ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు అభ్య‌ర్ధుల నుంచి నామినేష‌న్లు స్వీక‌రిస్తాన‌ని ప్ర‌క‌టించినప్ప‌టికీ ఏ ఒక్క అభ్య‌ర్ధి కూడా ముందు రాక‌పోవ‌డంతో ష‌ర్మిళ అయోమ‌యంలో ప‌డ్డారు.