YS Sharmila: ఈ విజయం తొలి అడుగు మాత్రమే
YS Sharmila: వైఎస్ షర్మిళ, వైఎస్ సునీతా రెడ్డిలు ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడకూడదు అని వైఎస్సార్ కాంగ్రెస్ కడప హైకోర్టులో వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై వైఎస్ షర్మిళ స్పందిస్తూ ఇది తొలి విజయం మాత్రమే అని అన్నారు.
“” దురాత్ముల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా, మాడుపగిలేలా, వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. భావప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షసమూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి, ఎప్పటికైనా ధర్మపోరాటంలో చివరికి న్యాయమే గెలుస్తుందని నిన్న నిరూపణ అయ్యింది. అధికార బలాన్ని ఉపయోగించి, మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసేవారికి ఈ స్టే చెంపపెట్టు. ఈ విజయం తొలి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో, వివేకకానంద రెడ్డి కుటుంబానికి న్యాయం కోసం పోరాటం ఉధృతం చేస్తాము. చిట్టచివరిగా విజయం, నిజం, న్యాయం వైపే ఉంటాయని చూపిస్తాం “” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.