AP Elections: పురంధేశ్వరి రూట్‌లో వైఎస్ ష‌ర్మిళ‌..!

AP Elections: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు రోజురోజుకీ ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. జాతీయ స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోందంటే అందుకు కార‌ణం వైఎస్ ష‌ర్మిళ (ys sharmila) నారా లోకేష్‌కు (nara lokesh) క్రిస్మ‌స్ కానుక ఇచ్చి అన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి (jagan mohan reddy) ఝ‌ల‌క్ ఇవ్వ‌డ‌మే.

వచ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓడిపోతాడ‌ని తెలుగు దేశం పార్టీ (tdp), జ‌న‌సేన (janasena) క‌లిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయని సంకేతాలు అందాయో ఏమో.. షర్మిళ చూపు TDP వైపు ప‌డింది. లేక‌పోతే ఎప్పుడూ లేనిది ఈసారి క్రిస్మ‌స్‌కు నారా లోకేష్‌కు ష‌ర్మిళ కానుక పంప‌డం ఏంటి? అంటే ఏపీలో ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక తెలుగు దేశం పార్టీ త‌నకు ఒక పోస్ట్ ఇవ్వ‌క‌పోదా అనే యోచ‌న‌లో ఉన్నారా? అందులో త‌ప్పు కూడా ఏమీ క‌నిపించ‌డంలేదు. దివంగ‌త నేత నంద‌మూరి తార‌క రామారావు కుమార్తె అయిన ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి (daggubati purandeswari) కూడా TDP నుంచి కాంగ్రెస్.. కాంగ్రెస్ నుంచి BJPకి చేరారు.

తండ్రి స్థాపించిన పార్టీలో పురంధేశ్వ‌రికి చోటు ద‌క్క‌లేద‌ని కాదు.. TDP ఓడిపోతే కాంగ్రెస్ వ‌స్తుంద‌ని.. కాంగ్రెస్ ఓడిపోతే BJP వ‌స్తుంద‌ని ఆలోచించుకుని పురంధేశ్వ‌రి ఆచి తూచి వ్య‌వ‌హ‌రించి త‌న రాజ‌కీయ ప్ర‌యాణాన్ని గీసుకున్నారు. ఇప్పుడు అదే బాట‌లో ష‌ర్మిళ ఉన్న‌ట్లు క్లియ‌ర్‌గా తెలుస్తోంది. తాను అడిగిన సీట్లు కాంగ్రెస్ ఇవ్వ‌క‌పోవడం ఏపీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌న‌ను వాడుకోవాల‌నుకోవ‌డం చూసి షర్మిళ కాస్త జాగ్ర‌త్త‌ప‌డ్డారు. కాంగ్రెస్ త‌ర‌ఫు నుంచి ఏపీ రాజ‌కీయాల్లో కాలు పెట్టే బ‌దులు తెలుగు దేశం పార్టీకి స‌పోర్ట్ చేస్తే త‌నకు రాజ‌కీయ బ‌లం కూడా పెరుగుతుంద‌ని ష‌ర్మిళ ఆలోచిస్తున్నార‌ని అందులో త‌ప్పేమీ లేద‌ని కూడా కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.