YS Sharmila: నీకు.. నీ మహిళా నేతలకు సిగ్గు లేదు
YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌లోని ఓ పాఠశాలలో తోటి విద్యార్థినిపై మరో విద్యార్ధి అత్యాచారం చేసిన ఘటన సంచలనంగా మారింది. దీనిపై APCC చీఫ్ వైఎస్ షర్మిళ. “” నా అక్కలూ, నా చెల్లెమ్మలు, నా తల్లులూ, నా అవ్వలూ అంటూ జబ్బలు చరిచి, మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలూ నటించే ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్రంలో, మీ పాలనలో మహిళల భద్రతకు, బ్రతుకులకు పట్టిన పీడా, దేశమంతా చెప్పుకుంటోంది. లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న మీకు, ఇక్కడి ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవు. రాష్ట్రానికి ఈ అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావు. మీరు, మీ మహిళా మంత్రులు, నాయకురాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారో, సిగ్గులేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారు “” అని మండిపడ్డారు.