YS Sharmila: అమ్మ చస్తే బాగుండు అంటోంది.. షర్మిళ కంటతడి
YS Sharmila: కన్నతల్లిని కోర్టుకి ఈడ్చిన కొడుకు పురిట్లోనే చంపేస్తే బాగుండు అని నా తల్లి ఏ రోజూ బాధపడలేదు. ఇలాంటి కోడుకును కన్నందుకు చస్తే బాగుంటుంది అని బాధపడుతోంది అంటూ మీడియా ముందు కన్నీరుపెట్టుకున్నారు వైఎస్ షర్మిళ. ఆస్తుల విషయంలో జగన్‌కు షర్మిళ మధ్య కొన్ని రోజులుగా లేఖల ద్వారా కొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఇటీవల సరస్వతి పవర్ ప్లాంట్ షేర్లు తిరిగి తన పేరు మీద బదలాయింపు జరిగే చూడాలంటూ నేషనల్ లా కంపెనీ ట్రిబ్యూనల్‌లో పిటిషన్ వేసారు. దీనిపై షర్మిళ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు.
“” నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు నా గురించి తప్పుగా మాట్లాడినా నేను పట్టించుకోను. కానీ ఈరోజు చిన్నాన్న వైవీ సుబ్బా రెడ్డి బయటికి వచ్చి నా గురించి మాట్లాడుతుంటే బాధేసింది. ఎందుకు బాబాయ్? నా బిడ్డలు నిన్న తాత తాత అంటూ తిరగలేదా? అలాంటి నా బిడ్డలకు అన్యాయం చేయాలని ఎలా అనిపించింది? నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను అబద్ధం ఆడటం లేదు. భారతి సిమెంట్స్ అని ఎందుకు పెట్టారు షర్మిళ సిమెంట్స్ అని ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు. ఆరోజు జగన్ అన్న భారతి పేరు పెడదాం నాన్నా అంటే మేం అభ్యంతరం చెప్పలేదు. పోనీలే వదినమ్మే కదా. ఈరోజు అదే పాయింట్‌ని మాకు వ్యతిరేకంగా వాడాలని ఎలా అనుకుంటారు? ఆస్తులు ఉన్నవారంతా జైలుకి పోతారా? అలా అంటే భారతి కూడా జైలుకి వెళ్లాలి కదా? 2019లో జగన్ అన్న ఎలా గెలిచారు? నువ్వెళ్లు షర్మిళ పాదయాత్రకు అనగానే ఒక్క క్షణం ఆలోచించకుండా వెళ్లాను. అన్న సూర్యుడి దగ్గరికి వెళ్లు అన్నా వెళ్లేదాన్నే. ఎందుకంటే జగన్ అన్న అంటే నాకు అంత ప్రాణం. నేను అన్ని చేస్తే జగన్ అన్న తన జీవిత కాలంలో నాకోసం ఏం చేసారు? ఇతన్ని అన్నా అనాలో సాడిస్ట్ అనాలో ప్రజలే నిర్ణయించుకోవాలి “” అంటూ కంటతడి పెట్టుకున్నారు షర్మిళ