YS Sharmila: జ‌గ‌న‌న్నా.. నా చేత త‌ప్పుడు ప్ర‌చారం చేయించింది నిజ‌మా కాదా?

ys sharmila challenges ysrcp

YS Sharmila: 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో నా చేత ప్ర‌తి బిడ్డ‌కు రూ.15000 అమ్మ ఒడి వేస్తామ‌ని ప్ర‌చారం చేయించింది నిజ‌మా కాదా అని సోద‌రుడు వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డిని నిల‌దీసారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిళ‌. నిన్న ష‌ర్మిళ ప్రెస్‌మీట్‌లో సాక్షి పేప‌ర్ తెలుగు దేశం పార్టీ ఇచ్చిన త‌ల్లికి వంద‌నం ప‌థ‌కంపై రాసిన వార్త‌ను విమ‌ర్శిస్తూ మ‌రి వైఎస్సార్ కాంగ్రెస్ ఏం చేసింది అని ప్ర‌శ్నించారు. దాంతో కాంగ్రెస్ తెలుగు దేశం పార్టీకి తొత్తులా ప‌నిచేస్తోంద‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. దీనిపై ష‌ర్మిళ మండిప‌డ్డారు.

“” పచ్చ కామర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా ఉంది YCP నేతల తీరు. సాక్షి పత్రికలో తల్లికి వందనం ఉత్తర్వులపై వచ్చిన వార్తకు చంద్రబాబు సమాధానం చెప్పాలని మేము అడిగితే … బాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడి పెట్టడం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనం.YCP నేతలకు కళ్ళుండి, వినడానికి చెవులు ఉండి, విజ్ఞత కలిగిన వాళ్ళే అయితే… మేము చెప్పింది ఏంటో ఒకటికి 10 సార్లు వినాలి. తల్లికి వందనం GO 29 క్లారిటీ లేదని, సాక్షి రాసిన వార్తకి వివరణ ఇవ్వాలని, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం వర్తింప జేయాలని డిమాండ్ చేస్తే .. కూటమి ప్రభుత్వానికి కొమ్ము గాసినట్లు ఎలా అవుతుంది? మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిలదీశాం కాబట్టే 24 గంటలు దాటకుండా సర్కారు ప్రజలకు వివరణ ఇచ్చుకుంది.

ప్రతిపక్షంగా తల్లుల పక్షాన మేము నిలబడితే కాంగ్రెస్ బాబుకి తోక పార్టీ ఎలా అవుతుంది? YCP నేతలకు బహిరంగ సవాల్. 2019 ఎన్నికల కంటే ముందు జగన్ గారు ఇంట్లో ఇద్దరు బిడ్డలకు ఇస్తామని చెప్పలేదా? ఆ ముక్క పట్టుకొని నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయలేదా? అది మీరు నిలబెట్టుకున్నారా? నిలువునా మోసం చేశారా? అది ప్రజలు మీకిచ్చిన తీర్పే చెప్తోంది. ఆ రోజు నా చేత ఊరూరా, ప్రతిచోటా ప్రచారం చేయించడం నిజం కాదా? నేను వైసీపీ కోసం బై బై బాబు కాంపెయిన్ చేయడం ఎంత నిజమో అమ్మ ఒడి కింద ఇద్దరు బిడ్డలకు 15000 రూపాయిలు చొప్పున, ప్రతి తల్లికి ఇస్తాం అని ప్రచారం చేయడం కూడా అంతే నిజం. మరి మీకు 15000 ప్రతిబిడ్డకు ఇచ్చే ఉద్దేశమే లేకపోతే నా చేత ఎందుకు అలా ప్రచారం చేయించారు? మీరు కూడా ఎందుకు కాంపెయిన్ చేశారు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం అని… జలయజ్ఞం పూర్తి చేస్తాం అని… ప్రత్యేక హోదా సాధిస్తాం అని ఎందుకు కాంపెయిన్ చేయించారు? మీరు కూడా ఎందుకు కాంపెయిన్ చేశారు? బహిరంగ చర్చకు మీరు సిద్ధమా? “” అని నిల‌దీసారు