YS Sharmila: నేను ఓడిపోతే నేరం గెలిచినట్లే
YS Sharmila: కడపలో కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న తాను ఓడిపోతే.. వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) గెలిచినట్లు కాదని.. నేరం గెలిచినట్లు అవుతుందని అన్నారు వైఎస్ షర్మిళ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయని.. కానీ కేవలం కడపలో మాత్రం ధర్మానికి, నేరానికి మధ్య ఎన్నిక జరుగుతోందని ఆమె తెలిపారు.
జగన్ మోహన్ రెడ్డి మాట్లాడితే కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును చార్జ్‌షీట్‌లో నమోదు చేసిందని ఆరోపణలు చేస్తున్నారని.. అసలు ఆయన పేరు పోలీస్ ఎఫ్ఐఆర్‌లో కూడా లేకపోతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేత నాన్న పేరు నమోదు చేయించి సీబీఐ చార్జ్‌షీట్‌లో కూడా వేయించారని తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఇతరులపై బురద జల్లుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు బటన్ నొక్కితే కాంగ్రెస్ పని చేస్తోందని జగన్ అంటున్నారని.. నిజానికి భారతీయ జనతా పార్టీ.. ఇంట్లో ఉన్న భారతి చేతిలో జగన్ రిమోట్ కంట్రోల్‌గా మారారని.. అక్కడ నరేంద్ర మోదీ ఏం చెప్తే అందుకు జగన్ సై అంటుంటారని విమర్శలు గుప్పించారు.