Sharmila: గాడిదలుకాస్కోండి.. కౌంటర్ ఇచ్చిన పోలీస్!
Hyderabad: వైఎస్సార్ తెలంగాణ పార్టీ(ysrtelangana) అధ్యక్షురాలు షర్మిళ(sharmila) పోలీసులపై చెయ్యి చేసుకుని రాద్దాంతం చేసారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు విషయమై సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు షర్మిళ యత్నించారు. దాంతో హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఆమె తన నివాసం నుంచి బయటికి వస్తుంటే బయటే కాపలాగా ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఓ ఎస్సైని పట్టుకుని నువ్వెవరు నన్ను ఆపడానికి అంటూ అతన్ని వెనక్కి నెట్టేసారు. మరో మహిళా కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించారు.. దాంతో ఎస్సై ఆమెను బండెక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అయినా షర్మిళ వినకుండా కారులో ఎక్కి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీదే కూర్చుని నిరసన తెలిపారు. ఆ సమయంలో షర్మళ పోలీసులను పట్టుకుని.. మీకేం పని లేకపోతే పోయి గాడిదెలు కాస్కోండి అని అసభ్యకరంగా మాట్లాడారు. దాంతో అక్కడే ఉన్న ఓ పోలీసు అదే పని చేస్తున్నాం అని షర్మళకు కౌంటర్ వేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో ఆమెను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోపక్క షర్మిళ తల్లి విజయమ్మ కూడా అడ్డుకుంటున్నందుకు ఓ మహిళా కానిస్టేబుల్ చెంపపై కొట్టింది. వారిద్దరినీ జైల్లో పెట్టాలని, పోలీసులపై ఎలా చేయించేసుకుంటారని BRS నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.