YS Sharmila: నాన్న విష‌యంలో సోనియాది తెలీక చేసిన త‌ప్పు

వైఎస్సార్ తెలంగాణ పార్టీని (ysrtp) కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు వైఎస్ షర్మిళ (ys sharmila) ఆలోచిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యం గురించి చ‌ర్చించేందుకు ఇటీవ‌ల ష‌ర్మిళ కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీని (sonia gandhi) క‌లిసి మాట్లాడారు. అయితే ఏం మాట్లాడారు అని అడ‌గ్గా.. అందం క‌లిసి క‌ట్టుగా ప‌నిచేయాల‌ని మాట్లాడుకున్నామ‌ని, ఎలా ప‌నిచేస్తే KCR పాల‌న‌ను అంతం చేయొచ్చో డిస్క‌స్ చేసామ‌ని తెలిపారు. (ys sharmila)

“” వండినట్లు తిన్న‌ట్లు కాదు రాజ‌కీయం అంటే. రాజ‌కీయం అంటే చిత్త‌శుద్ధి, గుండె నిబ్బ‌రం, ఓపిక ఉండాలి. నాతో అ రెండేళ్ల‌లో న‌డిచిన వారికి మాటిస్తున్నా. నేను నిల‌బ‌డ‌తాను. మిమ్మ‌ల్ని నిల‌బెడ‌తాను. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరు లో చేర్చింది సోనియా గంధీ. వారితో క‌లిసి ఎలా ప‌నిచేస్తారు అని నా వాళ్లే న‌న్ను ప్ర‌శ్నించారు కాబ‌ట్టి.. రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి విగ్ర‌హం ద‌గ్గ‌ర నిల‌బడి ఆయ‌న ఆత్మ సాక్షిగా మీకు తెలియాల్సిన విష‌యం ఉంది కాబ‌ట్టి నిజం చెప్తున్నా. నాలుగు గోడ‌ల మ‌ధ్య సోనియా, రాహుల్‌తో జ‌రిగిన సంభాష‌ణ‌ను నేను చెప్ప‌కూడ‌దు. కానీ వారిని నేను క్ష‌మించ‌మ‌ని అడుగుతున్నా. రాజీవ్ గాంధీ పేరు కూడా ఆయ‌న చనిపోయిన త‌ర‌వ్ఆత సీబీఐ అబ్‌స్కాండ‌ర్‌గా ఆయ‌న పేరు చేర్చారు. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. మాకు తెలిసి అంత‌టి ద్రోహం మేం రాజ‌శేఖ‌ర్ రెడ్డికి చేయం. ఆయ‌న్ను మేం అవ‌మానించాం అంటే ఎలా న‌మ్మారు అని నాతో అన్నారు. ఆయ‌న మీద మాకు అపార‌మైన గౌర‌వం ఉంది. ఆయ‌న లేని లోటు ఈరోజు కూడా తెలుస్తోంది అని అన్నారు. నాకు అర్థ‌మైంది ఏంటంటే.. ఇది వారు తెలియ‌క చేసిన పొర‌పాటే త‌ప్ప తెలిసి చేసింది కాదు. నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఆయ‌న‌కు గౌర‌వం ఇవ్వ‌ని చోట నేను నిల‌బ‌డ‌ను. నాన్న‌కు గౌర‌వం ఇవ్వ‌ని వారితో నేను చేతులు క‌ల‌ప‌ను. “” అని వెల్ల‌డించారు ష‌ర్మిళ‌.