YS Jagan: మీ ఇంట్లో లేవా గొడవలు?
YS Jagan: సోదరి వైఎస్ షర్మిళతో తనకున్న గొడవలు నిజమే కానీ పచ్చ మీడియా ఇంకాస్త ఎక్కువ చేసి రాసి లేనిపోనివి సృష్టిస్తోందని మండిపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి. విజయనగరంలోని గుర్లాలో డయేరియా బాధితులను జగన్ ఈరోజు పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “” ఆంధ్రప్రదేశ్‌లో హత్యలు, గొడవలు, మానభంగాలు, అతిసారం ప్రభలుతుంటే పచ్చ మీడియాకి చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడికి మాత్రం నా ఇంట్లోని గొడవలపైనే ఫోకస్ ఉంది. మీ ఇంట్లో గొడవలు లేవా? ఇలాంటి ఘర్ ఘర్ కీ కహానీ. అదేదో జగన్ ఇంట్లో మాత్రమే జరుగుతున్నాయి అన్నట్లు రోజూ నా గురించే రాస్తున్నారు. ఇవన్నీ పక్కనపెట్టి ముందు సూపర్ సిక్స్ అమలు చేయడంపై దృష్టి పెడితే బాగుంటుంది “” అని మండిపడ్డారు.