Jagan: నా చెల్లెలు షర్మిళను మిస్సవుతున్నా
Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన చెల్లెలు వైఎస్ షర్మిళపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన చెల్లెల్ని చాలా మిస్సవుతున్నానని అన్నారు. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా రక్తసంబంధాలు తెంచుకోలేం కదా అని అన్నారు. తన ఇంటి పిల్ల బయటకు వెళ్లి శత్రువులతో చేతులు కలపడం బాధాకరంగా ఉందని.. చంద్రబాబు నాయుడు చెప్పినట్లే నడుచుకుంటోందని తెలిపారు. షర్మిళకు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని ఆయన అన్నారు. దీనిపై షర్మిళ ఎలా స్పందిస్తారో చూడాలి.