YS Jagan: సర్ సర్ ఏంటి సర్ అది..?
AP: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (ys jagan) మళ్లీ తప్పుగా మాట్లాడేసారు. ఏపీ రాజధానిగా వైజాగ్ (vizag) అని ఎప్పుడో ప్రకటించిన జగన్ ఇప్పుడు అక్కడ ఐటీ హబ్ తీసుకురావాలని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త నీల్ రహేజా.. టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటుచేయాలనుకుంటున్నారు. హిందూపూర్‌లో 350 ఎకరాల్లో ఈ పార్క్ రాబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు వైజాగ్‌లో ఇనార్బిట్ మాల్ కూడా ఏర్పాటుచేయబోతున్నారు.
హైదరాబాద్‌లో కేవలం 8 ఎకరాల్లోనే ఇనార్బిట్ మాల్ కట్టారని, కానీ వైజాగ్‌లో 17 ఎకరాల్లో నిర్మించబోతున్నాం అని జగన్ అన్నారు. ఇక్కడి వరకు జగన్ స్పీచ్ బాగానే ఉంది. కానీ ఆయన ఐటీ హబ్ గురించి చెప్పేటప్పుడు తడబడ్డారు. రానున్న రోజుల్లో రెండున్నర లక్షల ఎకరాలలో ఐటీ స్పేస్ కూడా క్రియేట్ చేయబోతున్నారని జగన్ (ys jagan) అన్నారు. నిజానికి వైజాగ్ నగరం మొత్తం ఉన్నది 1,58,100 ఎకరాలు. కానీ జగన్ వైజాగ్‌లో 2,50,000 ఎకరాల్లో ఐటీ హబ్ కట్టబోతున్నారని అనేసారు. దాంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైపోయింది.