YS Avinash Reddy: మేం దాడులు చేసి ఉంటే TDP ఉండేది కాదు
YS Avinash Reddy: తాము అధికారంలో ఉన్నప్పుడు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలపై ఇలాగే దాడులకు పాల్పడి ఉంటే ఈపాటికి తెలుగు దేశం పార్టీ నామరూపాలు లేకుండాపోయేదని అన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. వినుకొండలో రషీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగడం కానీ.. తమ పార్టీ కార్యకర్తలు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలను కొట్టడం కానీ చేయలేదని.. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే భయంగా ఉందని అన్నారు.