AP Elections: ఎంపీ కావ‌లెను..!

AP Elections: YSRCP పార్టీ బంద‌రులో ఎంపీ అభ్య‌ర్ధి కోసం వేట మొద‌లుపెట్టింది. ఎవ‌రైనా ఉన్నారా అనే ప్రచారాన్ని మొద‌లుపెట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక్క‌డి సిట్టింగ్ ఎంపీ బాలశౌరి (balasouri) జ‌న‌సేన (janasena) పార్టీలో చేర‌డంతో మ‌రో ఎంపీని వెతికే ప‌నిలో ప‌డింది. ఇప్ప‌టికే ప‌రిశీల‌న‌లో పేర్ని నాని, ఆవ‌నిగ‌డ్డ ఎమ్మెల్యే సింహాద్రి ర‌మేష్ పేర్లు వినిపిస్తున్నాయి. పేర్ని నానినే ఎంపిక‌చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ ఆయ‌న ఒప్పుకోక‌పోతే ర‌మేష్‌ను బ‌రిలోకి దించుతారు.