Darsi: YCP నేతల రికార్డింగ్ డాన్సులు

Darsi: ప్ర‌కాశం జిల్లా దర్శిలో (darsi) అమ్మాయిలతో YCP నేతల రికార్డింగ్ డాన్సులు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దర్శిలో ఎమ్మెల్యే వేణుగోపాల్ (venugopal) బ‌ర్త్‌డే సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన కచేరిలో రికార్డింగ్ డ్యాన్సులు పెట్టారు. ఈ క్రమంలో స్థానిక YCP నేతలు అమ్మాయిలతో కలిసి బాహుబలిలోని మనోహర పాటలకు డ్యాన్సులు వేసారు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో వైర‌ల్ అవుతోంది. ఎన్నిక‌ల‌కు (ap elections) ముందు ఇలాంటి ప‌నులు చేస్తే పార్టీపై ఎఫెక్ట్ ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఇత‌ర YCP నేత‌లు మండిప‌డుతున్నారు.