AP Elections: పొత్తులోకి BJP .. సీట్లు నిర్ణయించేది పవనేనా?
AP Elections: జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) తెలుగు దేశం పార్టీతో (telugu desam party) పొత్తు పెట్టుకోకముందు భారతీయ జనతా పార్టీతో (bharatiya janata party) పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. BJPతో కలిసి పవన్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (ap elections) బరిలోకి దిగాలనుకున్నారు. ఈలోగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్ అయిపోవడం.. ఆ తర్వాత ఆయన్ను చూసేందుకు జనసేనాని వెళ్లి పొత్తు కుదుర్చుకుని రావడం జరిగిపోయాయి. చంద్రబాబును చూసి పవన్ చలించిపోయి కనీసం BJPతో ఒక్క మాటైనా చెప్పకుండా TDPతో పొత్తు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. తన నిర్ణయాన్ని BJP గౌరవిస్తుందని భావించి తెలుగు దేశంతో చేతులు కలిపానని పవన్ అన్నారు. (ap elections)
ఆ తర్వాత BJPకి ఏం చేయాలో పాలు పోలేదు. జనసేనతో పొత్తు ప్రకటించక ముందే చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసారు. పొత్తు గురించి చర్చించారని ఇందుకు BJP ఒప్పుకోలేదని టాక్ వచ్చింది. కేంద్రంలో BJP అధికారంలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఆ పార్టీకి సరైన పట్టు లేదు. దాంతో బలమున్న స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకోక తప్పదు. అందుకే జనసేనతో కలవాలని అనుకుంది. ఈలోగా పవన్ చంద్రబాబుతో పొత్తు ప్రకటించేయడంతో BJP వెనకడుగు వేసింది. అయినా పవన్ తగ్గలేదు. వీలు కుదిరినప్పుడల్లా వెళ్లి BJP పెద్దలతో మాట్లాడి తమతో చేతులు కలపాలని కోరారు. (ap elections)
ఇటీవల పవన్ ఢిల్లీకి వెళ్లి భారతీయ జనతా పార్టీ హైకమాండ్‌తో మాట్లాడటంతో వారు పొత్తుకు ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ స్థానాల్లో పోటీ చేస్తే మంచిది అనే విషయాన్ని మాత్రం పవనే దగ్గరుండి చూసుకుంటున్నారట. రాజకీయాలు ఆయనకు కొత్త అయినప్పటికీ నేతల ప్రవర్తనలను వారి గెలుపు ఓటములను అంచనా వేయడంతో పవన్ ఈ కొద్దికాలంలోనే ఆరితేరిపోయారట. దాంతో ఎవర్ని ఎక్కడి నుంచి పోటీ చేయిస్తే గెలుస్తారో అక్కడి నుంచే పోటీ చేయించాలని సేనాని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలుగు దేశం, జనసేనతో కలుస్తున్నాం అని భారతీయ జనతా పార్టీ రేపో మాపో ప్రకటించే అవకాశం ఉంది. (ap elections)
ఇకపోతే.. చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. భారతీయ జనతా పార్టీ హైకమాండ్‌తో పొత్తు గురించి తన సలహాలు కూడా ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తెలుగు దేశం పార్టీ ఒక నియోజకవర్గం, జనసేన పార్టీ రెండు నియోజకవర్గాలను ప్రకటించగా.. మిగతావి భారతీయ జనతా పార్టీ తమతో చేతులు కలిపాక నిర్ణయించాలని ఇరు పార్టీ నేతలు అనుకుంటున్నారు. ఎందుకంటే.. భారతీయ జనతా పార్టీకి తెలుగు దేశం, జనసేన పార్టీలు ఎంచుకున్న సీట్ల విషయంలో అభ్యంతరాలు ఉంటే మళ్లీ కథ మొదటికే వస్తుంది. అందులోనూ భారతీయ జనతా పార్టీ ముందు వెనకా ఆలోచించకుండా పొత్తులు పెట్టేసుకుని ఆ తర్వాత విడిపోవడం.. విడదీయడం వంటివి చేస్తూ ఉంటుంది. అందుకే ఆ పార్టీ విషయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. (ap elections)