NDA నేష‌న‌ల్ కన్వీన‌ర్‌గా ప‌వ‌న్?

Delhi: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను (pawan kalyan) NDA కూటమి జాతీయ కన్వీన‌ర్‌గా చేయ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. జాతీయ నేష‌న‌ల్ క‌న్వీనర్‌గా నియ‌మించాల్సిన వ్య‌క్తికి ఇంగ్లీష్, హిందీ బాగా వ‌చ్చి ఉండాలి. కానీ ప‌వ‌న్ ఇంగ్లీష్‌లో మాట్లాడినంత అన‌ర్గళంగా హిందీలో మాట్లాడ‌లేరు. అలాంటప్పుడు ప‌వ‌న్‌కు ఆ ప‌ద‌వి ఎలా ఇస్తారంటూ ఆయ‌న అంటే గిట్ట‌ని వారు తెగ ఏడుస్తున్నారు. మీడియా అడిగే ప్ర‌శ్న‌ల‌కు నాదెండ్ల మ‌నోహ‌ర్ (nadendla manohar) సాయం చేస్తే త‌ప్ప స‌మాధానం చెప్ప‌లేని ప‌వ‌న్‌.. నేష‌న‌ల్ క‌న్వీన‌ర్‌గా ఎలా ప‌నిచేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

NDA స‌మావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి జ‌న‌సేన‌కు త‌ప్ప మ‌రే పార్టీకి పిలుపు అంద‌లేదు. అందినా కూడా ఎవ్వరూ BJPతో పొత్తు పెట్టుకోవాల‌ని అనుకోవ‌డంలేదు. కానీ ముందు నుంచీ త‌మ స‌పోర్ట్ బీజేపీకేన‌ని ప‌వన్ అన్నారు. త‌మ‌తో TDO కూడా క‌లిస్తే ఏపీకే మంచిద‌ని తెలిపారు. కానీ TDP ఈసారి కూడా ఒంట‌రిగానే పోటీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.