Kavitha: ఈడీ కస్టడీలోకి కవిత?
Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో (delhi liquor case) భాగంగా మరోసారి BRS ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. కవితను ఈరోజు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళలను విచారించే సమయంలో పాటించాల్సిన నిబంధనలను ఈడీ పాటించడంలేదని కవిత సుప్రీంకోర్టుకు వెల్లడించారు. అయితే కవితను ఈడీ తమ కస్టడీలోకి తీసుకునే అవకాశం కొంత వరకు ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. చూడబోతే ఈరోజు కూడా కవిత విచారణకు హాజరుకారని తెలుస్తోంది. విచారణకు హాజరుకాకపోతే కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తుందని ఈడీ హెచ్చరించింది.
ఈ లిక్కర్ స్కాంలో ఇప్పటికే ఈడీ కవితకు మూడు సార్లు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ఎన్నికలకు ముందు కూడా కవిత ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. అయితే అప్పుడు ఆమెను అరెస్ట్ చేయలేదు. ఆ తర్వాత రెండోసారి నోటీసులు జారీ చేసినప్పుడు కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు మూడోసారి కూడా నోటీసులు రావడంతో ఇక కవిత ఏం చేస్తారు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.