Janasena: తెలంగాణ‌లో BJPతో క‌లిసి బ‌రిలోకి?

Janasena BJP Alliance: తెలంగాణ ఎన్నిక‌ల్లో (telangana elections) జ‌న‌సేన‌.. (janasena) భార‌తీయ జ‌న‌తా పార్టీతో (BJP) క‌లిసి బ‌రిలోకి దిగ‌నుందా? అవున‌నే అంటున్నాయి విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు. మొన్న‌టి వ‌ర‌కు ఏపీ ఎన్నిక‌ల్లో (ap elections) NDAతో క‌లిసి బ‌రిలోకి దిగుతాన‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..(pawan kalyan) ఆ త‌ర్వాత TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్ అవ్వ‌డంతో ఆ పార్టీ ప‌రిస్థితిని చూసి తెలుగు దేశం పార్టీతో క‌లిసి ఏపీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఈ విష‌యం గురించి క‌నీసం BJP హైక‌మాండ్‌తోనూ ప‌వ‌న్ చ‌ర్చించ‌కుండానే సొంతంగా పొత్తుల ప్ర‌క‌ట‌న‌లు చేసేసారు.

అయితే ఏపీలో తెలుగు దేశం పార్టీని త‌మ కూట‌మిలో క‌లుపుకునేందుకు భార‌తీయ జ‌నతా పార్టీ సిద్ధంగా లేదు. ఏదో మాట‌వ‌ర‌స‌కి ప‌వ‌న్ వారితో మాట్లాడ‌తాన‌ని చెప్పారు కానీ అది అయ్యే ప‌ని కాదు. అందుకే ప‌వ‌న్.. NDAతో పూర్తిగా తెగ‌తెంపులు చేసుకోకుండా తెలంగాణ ఎన్నిక‌ల్లో వారితో క‌లిసి బ‌రిలోకి దిగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్.. తెలంగాణ BJP నేత‌ల‌తో స‌మావేశం అవుతున్నార‌ట‌. ఇప్ప‌టికే ప‌వ‌న్ తెలంగాణ BJP రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డితో (kishan reddy) మంత‌నాలు జ‌రిపార‌ని టాక్. (janasena bjp alliance)

అందుకే BJP మేనిఫెస్టో ఆల‌స్యం అవుతోందా?

ఇప్ప‌టికే తెలంగాణ ఎన్నిక‌ల డేట్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్, పార్టీలు త‌మ మేనిఫెస్టోల‌ను విడుద‌ల చేసేసాయి. కానీ భార‌తీయ జ‌న‌తా పార్టీ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు అభ్య‌ర్ధుల జాబితాను కానీ మేనిఫెస్టోను కానీ ప్ర‌క‌టించ‌లేదు. దాంతో పార్టీ నేత‌లు కూడా అయోమ‌యంలో ప‌డిపోయారు. ఒక‌సారి జ‌న‌సేన‌తో సీట్ షేరింగ్ అంశాల గురించి చ‌ర్చించాక మేనిఫెస్టోను, అభ్య‌ర్ధుల జాబితాను రిలీజ్ చేస్తే బాగుంటుంద‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. (janasena bjp alliance)