Israel Hamas War: భార‌త్‌పై ప్ర‌భావం ప‌డుతుందా?

Israel Hamas War: ఇజ్రాయెల్ హ‌మాస్ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతున్న నేప‌థ్యంలో దాని ప్ర‌భావం భార‌త్‌పై (India) ప‌డ‌నుందా? మ‌న‌కేమీ ఇజ్రాయెల్‌తో పెద్ద‌గా ప‌ని ప‌డ‌దు. అమెరికా, కెన‌డా, యూకే లాగా మ‌న‌కు ఇజ్రాయెల్ అంత కీల‌క పార్ట‌న‌ర్ ఏమీ కాదు. కానీ భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (Narendra Modi) మాత్రం ఇజ్రాయెల్‌కి స‌పోర్ట్ చేస్తున్నారు. ఈ యుద్ధం భారత్‌పై ప్ర‌భావం చూపుతుందా లేదా అనే అంశంపై స్పందించారు పొలిటిక‌ల్ సైంటిస్ట్ ఇయాన్ బ్రెన్న‌ర్ (ian brenner). ఈ యుద్ధం వ‌ల్ల భార‌త్‌పై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌ని ఎందుకంటే భార‌త్ అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అని అన్నారు. ఇరాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌కు భారత్‌తో క‌లిసి ప‌నిచేసేందుకు ఎన్నో కార‌ణాలు ఉన్నాయని తెలిపారు.