Kalvakuntla Kavitha: షాకింగ్.. కవిత అరెస్ట్
Kalvakuntla Kavitha: భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ వారెంట్ జారీ చేసారు. కవితను అదుపులోకి తీసుకుని ఢిల్లీ తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. దాంతో కవిత ఇంటికి హరీష్ రావు, KTR వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కవిత ఇంటి ముందు భారత రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) భాగంగా హైదరాబాద్లోని కవిత ఇంటికి ఢిల్లీ నుంచి 10 మంది ఈడీ అధికారులు మూడు బృందాలుగా వచ్చారు. ముందుగా కవిత నుంచి ఇంట్లో వారి నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకుని పలు డాక్యుమెంట్లను చెక్ చేసారు. గత పదేళ్ల ఆర్ధిక లావాదేవీల వివరాలు తెలుసుకుంటున్నారు. సోదాల్లో భాగంగా ఆమె సహాయకుల సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈడీ దాడులతో కవిత ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నేపథ్యంలో ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయి. ఈడీతో పాటు ఐటీ అధికారులు కూడా సోదాలు చేస్తారని అన్నారు. కానీ ఇప్పటికైతే ఈడీ అధికారులకు మాత్రమే సోదాలు చేసుకునే అవకాశం కల్పించారు. మనీ లాండరింగ్ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. అయితే.. దాదాపు పది సంవత్సరాలకు సంబంధించిన ఆర్ధిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్నారు. సోదాలు ముగిసిన తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాదాపు పది మంది ఈడీ అధికారులు ఇంట్లో పూర్తి స్థాయిలో సోదాలు కొనసాగిస్తున్నారు. కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.
ALSO READ: Delhi Liquor Scam: BRS వర్గాల్లో హై టెన్షన్
లిక్కర్ స్కాంలో భాగంగా పలుమార్లు నోటీసులు అందినా కూడా కవిత విచారణకు హాజరుకాలేదు. మహిళల్ని ఇంట్లోనే విచారించాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసారు. ఈ నేపథ్యంలో అనుమానితురాలిగా ఉన్న కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితురాలిగా చేర్చి నోటీసులు ఇచ్చారు. ఆ విచారణకు కూడా కవిత హాజరుకాకపోవడంతో ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి రావాల్సి వచ్చింది. ఈ దాడుల తర్వాత కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు విచారణకు రమ్మంటే ఆడవారిని విచారించాల్సిన పద్ధతిలో విచారించడంలేదు అని కవిత తప్పించుకుని తిరుగుతున్నారు. సో ఇక ఈడీ దగ్గర మిగిలింది అరెస్ట్ వారెంట్ మాత్రమే.